Megastar Chiranjeevi Godfather: మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొని ఎదురుచూసిన ఆచార్య సినిమా విడుదల తర్వాత వాళ్ళని ఎంతలా నిరాశపరిచిందో మన అందరికి తెలిసిందే..మెగాస్టార్ కెరీర్ లోనే ఇంత చెత్త సినిమా ఎప్పుడూ చూడలేదంటూ అభిమానులు పెదవి విరిచారు..కొరటాల శివ తన కేర్ లెస్ డైరెక్షన్ మరియు టేకింగ్ తో చిరంజీవి కెరీర్ లో మాయని మచ్చలాంటి సినిమాని ఇచ్చాడంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు..ఇప్పుడు వారి ఆశలన్నీ చిరంజీవి తదుపరి చిత్రం ‘గాడ్ ఫాదర్’ పైనే పెట్టుకున్నారు..మలయాళం లో మోహన్ లాల్ హీరో గా నటించిన లూసిఫెర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి తమిళ టాప్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించాడు..ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు వీడియో అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది..సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి ని ఎన్నడూ చూడండి విధంగా చూసేసరికి అభిమానులు కాస్త థ్రిల్ కి గురయ్యారు..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబందించిన కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి అభిమానులకు ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేలా చేస్తున్నాయి.

అదేమిటి అంటే ఈ సినిమా లో చిరంజీవి మరియు నయనతారలు అన్న చెల్లెలుగా నటిస్తున్నారు..వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ కూడా చిత్రానికి హైలైట్ గానిలవబోతున్నాయట..ఇద్దరు ఒకరికొక్కరు పోటీపడిమరీ నటించినట్టు సమాచారం..ఇక బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈయనకి సంబంధించిన సన్నివేశాలన్నీ కూడా ఇప్పటికే చిత్రీకరించేసారు..ఇందులో సల్మాన్ ఖాన్ చిరంజీవి కి బాడీ గార్డ్ గా కాసేపు కనిపించనున్నారు..వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కూడా చిత్రానికి హైలైట్ గా నిలవబోతున్నట్టు సమాచారం.
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి చిరిగిన చొక్కాతోనే తాళి ఎందుకు కట్టాల్సి వచ్చింది?

అంతే కాకుండా ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక మాస్ సాంగ్ ని కూడా చిత్రీకరించబోతున్నారట..ప్రభుదేవా ఈ పాటకి కొరియోగ్రఫీ చెయ్యబోతున్నట్టు సమాచారం..ఇక ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ హీరో సత్యదేవ్ నటించబోతున్నాడట..ఈయన మెగాస్టార్ చిరంజీవి కి ఎంత పెద్ద వీరాభిమాని అనే విషయం మన అందరికి తెలిసిందే..ఆచార్య సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో తళుక్కుమని మెరుస్తాడు సత్యదేవ్..ఇప్పుడు ఏకంగా గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవిని ఢీ కొట్టే పాత్రలో కనిపించబోతున్నాడు..ఇలా ఎన్నో ప్రత్యేకతలు మధ్య తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా మెగాస్టార్ కెరీర్ లో మైలు రాయిలాగా నిలిచిపొయ్యే సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలంటే ఈ దసరా వరుకు వేచి చూడాల్సిందే.
Also Read:Top Heroines Mistakes: టాప్ హీరోయిన్లు చేసే అతిపెద్ద పొరపాటు ఏది?