Roja Daughter Anshu Malika: రోజా పరిచయం అక్కర లేనిపేరు. సినిమారంగంలో తనకంటూ ఏ గురువు లేకున్నా.. నటిగా వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సొంతంగానే ప్రజాదరణ పొందారు. టీవీ షోలతోనూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. తల్లికి తగ్గ తనయగా రోజా కూతురు అన్షు సత్తా చాటుకుంటోంది. రోజాకు పిల్లలంటే ప్రాణం. సినిమాలతో, రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారు.

ఇద్దరు పిల్లలకు ఎలాంటి కష్టం రావొద్దని తాను అనేక కష్టాలు పడ్డానని, అవమానాలను భరించానని పలు సందర్భాల్లో పేర్కొన్నారు రోజా. ఇప్పుడు కూతురు ప్రతిభను చూసి ఉబ్బి తబ్బిబవుతున్నారు. పుస్తక చరనలలో అన్షు మలిక సెల్వమణి ఇప్పటికే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ అరుదైన పురస్కారాన్ని అందుకుంది. ఉత్తమ రచయిత కేటగిరీలో ఆమె రాసిన బుక్ ఎంపికైంది. ఈ బుక్ పేరు ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్. ఈ కేటగిరీలోకి దక్షిణాది రాష్ట్రాల నుంచి అందిన పుస్తకాల్లో ఇదొక్కటే ది బెస్ట్ అనిపించుకుంది. బెస్ట్ ఆథర్ అవార్డ్ కోసం అన్షు ఎంపికయ్యారు.
Also Read: Vice President Venkaiah Naidu: వెంకయ్యనాయుడుకు ఇక రిటైర్మెంటేనా?
కోల్‌కతాలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో అన్షు ఈ అవార్డును అందుకున్నారు.జీ టౌన్ మేగజైన్ ఈ పోటీ నిర్వహించింంది. ప్రతి సంవత్సరం వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి పురస్కారాలను అందజేస్తుంటుంది. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వివిధ కేటగరీల కింద వందలాదిమంది రచయితలు రాసిన పుస్తకాలను జ్యూరీ సభ్యులు పరిశీలించారు. అందులో బెస్ట్ ఆథర్ కేటగిరీ కోసం అన్షు మలిక రాసిన ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ బుక్‌ను ఎంపిక చేశారు.

వెబ్ డెవలపర్, కంటెంట్ క్రియేటర్‌గా..
అన్షు తల్లిదండ్రులు రోజా, సెల్వమణి ఇద్దరూ సినిమారంగంలో ఉన్నారు. ప్రస్తుతం అన్షు వెబ్ డెవలపర్, కంటెంట్ క్రియేటర్ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. రచయితగా రాణిస్తోన్నారు. సామాజిక కార్యకర్తగా గుర్తింపు ఉంది. తన పుట్టిన రోజు వేడుకలను ఎక్కువగా హైదరాబాద్‌లోని ఛీర్స్ ఫౌండేషన్ నిర్వహించే సామాజిక కార్యక్రమాల ద్వారా జరుపకుంటుంది. ఈ ఫౌండేషన్‌కు చెందిన పేద పిల్లల్లో ఐదుగురిని ఆమె చదివిస్తోన్నారు. రోజా కూడా తిరుపతికి చెందిన ఓ విద్యార్థినిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తన సొంత ఖర్చులతో మెడిసిన్ చదవిస్తోన్నారు.
Also Read:Anasuya Bharadwaj: అనసూయ ఒంటిపై పచ్చ బొట్టు… అందులో రహస్యం ఆమె చెప్పాలి