India- Russia: యుద్ధం అంటే ప్రతీకారం మాత్రమే కాదు.. అంతకుమించిన అవసరాలు కూడా.. పాకిస్తాన్ తో యుద్ధం చేసినప్పుడు భారత్ ముందు చూపుతో కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో భారీగా నిత్యావసరాలను స్టోర్ చేసుకుంది. దానివల్ల సైనికుల క్షుద్బాధ తీరింది. ఫలితంగా భారత్ యుద్ధంలో విజయం సాధించింది. ఇరాన్, ఇరాక్ పై యుద్ధం చేసినప్పుడు అమెరికా కూడా ఇలానే వ్యవహరించింది. ఇప్పుడు ఉక్రెయిన్ తో యుద్ధం వల్ల రష్యా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యాలోని సూపర్ మార్కెటల నుంచి అమెరికన్ యూరోపియన్ రిటైలర్లు వెనక్కి వెళ్లిపోయారు. దీంతో మార్చి నెల రెండో వారం వరకు రష్యన్ సూపర్ మార్కెట్ లు సగానికి సగం ఖాళీ అయిపోయాయి. చైనా నుంచి కొన్ని బ్రాండ్లు వచ్చినా ఇంకా రష్యన్ సూపర్ మార్కెట్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. చైనాలో కూడా సంక్షోభం ఉండడంతో ఆహార పదార్థాల విషయంలో డ్రాగన్ దేశం తన వరకే పరిమితం అవుతున్నది. తప్పితే ఎగుమతి చేయడం లేదు. ఈ అవకాశాన్ని భారత్ ఉపయోగించుకునేందుకు ముందుకు వచ్చింది. కానీ భారత్ అటువంటి ప్రతిపాదన చేయకముందే రష్యా అధ్యక్షుడు తానంత తానే తమ రిటైల్ మార్కెట్ల విషయంలో భారత్ సహాయాన్ని కోరాడు. ప్రస్తుతం రష్యాలో భారత్ రిటైల్ మార్కెట్ల చైన్లను ఎలా ప్రవేశపెట్టాలోనని మోదీ, పుతిన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి.

సాధ్యం అవుతుందా?
ఒకే సారి పెద్ద మొత్తంలో రష్యాలోని సూపర్ మార్కెట్లలో మన ఉత్పత్తులని పెట్టి అమ్మడానికి చిన్న, మధ్యస్థాయి రిటైలర్ల ఆర్ధిక స్థోమత సరిపోదు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టగల వాళ్ళకే సాధ్యమవుతుంది. పూర్తిగా మన దేశ ఉత్పత్తులు రష్యాలో అమ్ముడుపోవు. యూరోప్,అమెరికాల నుంచి కొన్ని ప్రొడక్ట్స్ ని కొని వాటిని మళ్ళీ రష్యాలో అమ్మాల్సి ఉంటుంది.
టాటా గ్రూప్, రిలయన్స్ రిటైల్, దమానీ [Dmart], బిగ్ బజార్ లాంటి దిగ్గజాలు మాత్రమే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టగలవు. కొద్దో గొప్పో కొంతమంది భారతీయ ఉద్యోగులను అక్కడ ఉంచాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం తో కలిసి రష్యన్ అధికారులు ఒక రోడ్ మ్యాప్ తయారుచేస్తున్నారు ఎందుకంటే రష్యాలో డిమాండ్, సేల్స్ ఉండే ప్రొడక్ట్స్ వివరాలు ఆ దేశ అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అవి మనదేశంలో దొరుకుతాయా లేక దిగుమతి చేసుకోవాలా అనే విషయాలని పరిశీలించాల్సి ఉంటుంది.
ఇక బర్గర్ కింగ్ లాంటి ఫుడ్ చైన్ల కి రష్యాలో డిమాండ్ ఉంది. ఇంకా ఎవన్నా భారతీయ ఫుడ్ చైన్ల కి అక్కడ అవకాశాలు ఉంటాయేమో పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న కే ఎఫ్ సీ రష్యాని వదిలిపెట్టి వెళ్ళిపోయింది.
Also Read: Pawan Kalyan Janavani : జనం ఘోష Vs జగన్ ఘోష
ఆటోమొబైల్ రంగంలోనూ
యూరోప్ ఆటో దిగ్గజాలు అయిన దైమ్లర్ బెంజ్, రేనాల్ట్ లు రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. కానీ రష్యా తమకి అందుబాటులో ఉన్న వాటితో తిరిగి ఉత్పత్తిని ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మరి వైపు బోయింగ్,ఎయిర్ బస్ విమానాలను రష్యా లీజుకి తీసుకొని నడుపుతున్నది అయితే ఆంక్షల వల్ల వాటి ఆపరేషన్ నిలిచిపోవడంతో రష్యా వాటిని పూర్తిగా తమ అదుపులోకి తీసుకొని నడుపుతున్నది. ఈ విమానాలకి ఇన్స్యూరెన్స్ చేసేవి అమెరికా కి చెందిన సంస్థలు. కానీ ఇప్పుడు అవి రష్యా ఆధీనంలో ఉన్న విమానాలకి ఇన్స్యూరెన్స్ చేయడానికి ఒప్పుకోవట్లేదు . చైనాలో ఒకే ఒక్క అంతర్జాతీయ పౌరవిమాన ఇన్స్యూరెన్స్ సంస్థ ఉంది అది రష్యాలో నిలిచిపోయిన అమెరికన్, ఫ్రాన్స్ విమానాలకి ఇన్స్యూరెన్స్ చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు బోయింగ్, ఎయిర్ బస్ విమానాలకి స్పేర్ పార్ట్శ్ అవసరం ఉంది కానీ చైనా తన దగ్గర ఉన్న స్పేర్ పార్ట్శ్ రష్యాకి ఇస్తుందా ? అలా చేస్తే చైనాని బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంది.
ఆయిల్ బావుల్లో అమెరికన్ బ్రిటిష్ కంపెనీల పెట్టుబడులు
రష్యన్ ఆయిల్ బావులలో అమెరికన్,బ్రిటీష్ సంస్థలు పెట్టుబడులు పెట్టి ఆయిల్ ని వెలికితీసే ప్రక్రియలో భాగస్వాములుగా ఉంటూ వచ్చాయి. కానీ ఆంక్షల వల్ల రెండు దేశాలు వాళ్ళ సిబ్బందిని వెనక్కి పిలిపించాయి దాంతో రష్యాలోని చాలా ఆయిల్ బావులలో చమురు వెలికి తీసే ప్రక్రియ త్వరలో ఆగిపోనుంది. ఇదే జరిగితే రష్యా తన ఆయిల్ ఎగుమతులలో కోత పెట్టాల్సి వస్తుంది. కానీ భారత ప్రధాని మోదీ ఓఎన్జీసీ కి అవకాశాలు ఉన్నాయేమో చూడమని ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఉన్నవి అమెరికన్, బ్రిటీష్ ఎక్విప్మెంట్ కాబట్టి వాటి మీద పని చేసిన అనుభవం ఓఎన్జీసీ కి ఉంది. కాబట్టి రష్యన్ ఆయిల్ రంగంలోకి ఓఎన్జీసీ కి అవకాశాలు ఉన్నాయి. భారత్ కంటే అతి పెద్ద తయారీదారు దేశం గా ఉన్న
చైనా తన ఎగుమతులని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తూ చాలా వాటికి దూరంగా ఉంటున్నది ఇప్పుడు. భవిష్యత్ లో తమ ఎగుమతుల మీద [అన్నిటిమీద కాదు] ఆంక్షలు విధించకుండా జాగ్రత్తపడుతున్నది. అందుకే రష్యన్ రిటైల్ రంగం విషయంలో పుతిన్ భారత్ వైపు చూస్తున్నాడు.

భారత నేవీ ని బలపరుచుకునే దిశగా
గతంలో ఎన్నడు లేని విధంగా నేవీని భారతదేశం బలోపేతం చేస్తోంది.
భారత నేవీ కి సంబంధించి F-18 సూపర్ హార్నెట్ కొనుగోలు మీద బోయింగ్ అనే సంస్థ ఆశలు పెట్టుకుంది. మరో వైపు భారత్ ఎయిర్ ఫోర్స్ కోసం 114 యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్ తో పాటు అమెరికా కూడా పోటీలో ఉంది. అమెరికా తన అధునాతన F-15 EX స్ట్రైక్ ఈగిల్ ని భారత్ కి అమ్మడానికి గట్టి పట్టుదలతో ఉంది. ఇది రష్యన్ ఫైటర్ జెట్ లని భారత్ కి దూరంగా ఉంచడంలో సఫలీకృతం అవుతుంది అని అమెరికా భావిస్తున్నది. కాబట్టి రష్యన్ రిటైల్ రంగంలో భారత్ పెట్టుబడులు పెట్టడం మీద పెద్దగా అభ్యంతరం పెట్టకపోవచ్చు.
ఎక్కడ వ్యాపార,వాణిజ్య అవకాశాలు ఉంటే అక్కడ భారత్ పెట్టుబడులు పెట్టే విషయంలో మోడీ ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నది. మొన్నామధ్య రష్యాలో రిటైల్ పెట్టుబడులు పెట్టే విషయంలో అమెరికా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. అందుకు దీటుగానే భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ బదులిచ్చారు. ఇప్పుడున్నది పాత భారత్ కాదని.. మీరు ఎలాగైతే ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడతారో.. మేం కూడా అలాగే పెడతామని.. ఏ దేశమైనా భారత్ కిందికి రావాలని, ఆ రోజులు త్వరలోనే వస్తాయని దీటుగా బదులిచ్చారు.
Also Read:UN Population Report 2022: ఏడాదిలో మనమే నంబర్.. కొద్ది రోజుల్లో చైనాను దాటేస్తాం!
[…] […]