Acharya: ‘ఆచార్య’ సినిమా ప్రేక్షకులను ఆకట్టులేక పోవడానికి కారణాలు ఏమిటి ? అంటూ ప్రస్తుతం తెలుగు సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. నిర్మాత, దర్శకుడు, హీరో ఈ ముగ్గురి మితిమీరిన ఆత్మ విశ్వాసమే ఈ చిత్ర పరాజయానికి మూలకారణం అంటూ ఫిల్మ్ క్రిటిక్స్ ఇప్పటికే ఆచార్య పై యుద్ధం ప్రకటించారు.
అలాగే మరో కారణం.. మొదటి నుంచి సినిమా పై భారీ అంచనాలు పెంచడం.. ప్రస్తుత రోజుల్లో సినిమా గురించి సినీ మీడియా ఉన్నదాని కంటే వంద రెట్లు ఎక్కువ చేసి చెబుతుంది. అలాగే లేనిపోని క్రియేట్ చేసి రాయడం కూడా ఒక ఫ్యాషన్ గా మారింది. ఇది కూడా ఆ చిత్ర పరాజయానికి రెండో కారణంగా నిలుస్తుంది.
Also Read: End Of The Movie: సినిమాల ముగింపులోనూ చాలా కథ ఉంది !
అసలు దర్శకుడు కొరటాల శివ ఆచార్య కథను సెట్ మీదకి తీసుకు వెళ్లే ముందే దానిలోని లోపాలను సవరించుకొని ఉంటే బాగుండేది. పైగా అర్ధాంతరంగా కథానాయికను తొలగించి, ఈ పనికి దర్శకుడు ఇచ్చిన వివరణ కూడా అంతా సరిగా కనిపించడం లేదు. దీనిని బట్టి అర్ధం అవుతుంది ఏమంటే.. దర్శకుడికి తాను రాసుకున్న కథ పైన కొరటాల శివకు పెద్దగా పట్టులేదని అనిపిస్తోంది.
అయినా.. ఎంత మెగాస్టార్ అయినా హీరోయిజాన్ని చిత్రంలో ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించడమే మంచిది. అలా కాకుండా.. నా హీరో 200% హీరోయిజం చూపిస్తాడు అని ముందుకెళ్తే సినిమా ఇలాగే చతికిల పడుతుంది.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే దర్శకుడు, నిర్మాత, హీరో ఈ చిత్రాన్ని చాలా చక్కగా భారీగా ప్రమోట్ చేశారు. ఇటీవల వచ్చిన విజయ్ దళపతి సినిమా బీస్ట్ కూడా ఇలాంటిదే. ఏది ఏమైనా కొరటాల కెరీర్ కి ప్రస్తుతం ప్లాప్ రుచి ఏమిటో తెలిసొచ్చింది.
Recommended Videos: