End Of The Movie: సినిమాల ముగింపులోనూ చాలా కథ ఉంది !

End Of The Movie: ఒకప్పుడు దాదాపు ప్రతీ తెలుగు సినిమాలలో చివర “శుభం” అని ఇచ్చే వారు, ఇప్పుడూ ఇస్తున్నారా? క్లైమాక్స్ అనగానే ఈల వేసుకుంటూ పోలీసులు వచ్చేసేవారు. “రండి ఇన్స్‌పెక్టర్ గారూ ఈ దుర్మార్గులను జైల్లో వేయండి” అని మనస్సు మార్చుకున్న సూర్యాకాంతం అంటే “మిస్టర్ యువార్ అండర్ అరస్ట్” అని పోలీస్ ఇన్స్‌పెక్టర్ అనడమూ, పళ్ళు పటపట కొరుకుతూ రాజనాల జైలుకు వెళ్ళిపోవడమూ జరిగిపోయేవి. లేదంటే చేసిన తప్పుకు చింతిస్తూ “నాలాంటి దుర్మార్గుడికి […]

Written By: Shiva, Updated On : April 30, 2022 5:17 pm
Follow us on

End Of The Movie: ఒకప్పుడు దాదాపు ప్రతీ తెలుగు సినిమాలలో చివర “శుభం” అని ఇచ్చే వారు, ఇప్పుడూ ఇస్తున్నారా?
క్లైమాక్స్ అనగానే ఈల వేసుకుంటూ పోలీసులు వచ్చేసేవారు. “రండి ఇన్స్‌పెక్టర్ గారూ ఈ దుర్మార్గులను జైల్లో వేయండి” అని మనస్సు మార్చుకున్న సూర్యాకాంతం అంటే “మిస్టర్ యువార్ అండర్ అరస్ట్” అని పోలీస్ ఇన్స్‌పెక్టర్ అనడమూ, పళ్ళు పటపట కొరుకుతూ రాజనాల జైలుకు వెళ్ళిపోవడమూ జరిగిపోయేవి.

Cinema

లేదంటే చేసిన తప్పుకు చింతిస్తూ “నాలాంటి దుర్మార్గుడికి ఈ సభ్య సమాజంలో ఉండే హక్కు లేదు” అని స్వయానా నాగభూషణమే ఒప్పుకుని బేడీలు వేయించుకునేవాడు. కాకపోతే – ఎన్టీ రామారావు “పెద్దయ్యా, ఎంత చెడ్డా బావ మనవాడు. అందరూ మనవారు అన్నది మరచిపోయాడు. అనవసరంగా జైలుపాలు చేస్తే మనమే బాధపడాలి కదా” అని ఎస్వీఆర్‌ని కన్విన్స్ చేస్తే రేలంగి “నన్ను క్షమించు బావా” అనేవాడు, జామీను మీద విడిపించుకునేవారు.

ఏది ఎలా తిరిగినా చివరకు అందరూ కలిసిన ఒక ఫ్యామిలీ ఫోటో పడేది. అయితే, బొమ్మ రంగుల్లోకి మారాకా కూడా చివర్‌లో పోలీసులకు బదులు పెళ్ళి మండపం, పశ్చాత్తాపానికి బదులు ఒక జోకు వంటి మార్పులు వచ్చినా మారినా చాలా సినిమాల్లో ఇది మారలేదు: అయితే, అందరూ ఇలాగే “శుభం” చెప్పి ఎందుకు పంపిస్తారు. ఉప్పు బదులు వెరైటీ, కారం బదులు వెటకారం తిని పెరిగిన దర్శక నిర్మాతలు ఎందరో ఉన్నారు మరి.

Also Read: Shruti Haasan Interesting Comments: ‘పవన్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్’ల పై శృతీహాసన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

ఏది ఏమైనా ముందు తరం దర్శకులు ఒక బాటను వేశారు కాబట్టి తర్వాత వారు కూడా ఈ కొత్తబాటలోనే సాగిపోతున్నారు. అలాగని, శుభం వేసేవాళ్ళూ తక్కువేమీ లేరు. ఇక, పూరీ జగన్నాథ్ “Thank you, Puri Jagannadh” అని కార్డు వేసి సినిమాకు వచ్చినవారికి కృతజ్ఞతలు చెప్తాడు. రాజమౌళీ ముద్ర అందరికీ తెలిసిందే. శేఖర్ కమ్ముల “A Sekhar Kammula Film” అని వేస్తారు.

Puri Jagannath

ఇలా చాలామంది దర్శకులు తమ పేరు, ముద్ర వేసుకుంటారు. ఇది కాక “The End” మొదటి నుంచీ ఫేమస్సే. అన్ని సినిమాలూ శుభంగానే ముగియాలనేమీ లేదు కదా. కాబట్టి, ఇది కూడా ఉంది. ఉత్తినే రోలింగ్ టైటిల్స్ వేసి ముగించెయ్యడమూ ఫేమస్సే.

Rajamouli

Also Read: Allu Arjun: పవన్ డైరెక్టర్ తో బన్నీ ప్లానింగ్.. సెట్ ఐతే షాకే !

Recommended Videos:

Tags