Mazaka Trailer
Mazaka Trailer : ప్రస్తుతం మజాకా సినిమాతో త్రినాధ్ రావ్ నక్కిన తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక గత రెండు సంవత్సరాల క్రితం రవితేజ హీరోగా వచ్చిన ‘ధమాకా ‘ (Dhamaka) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ సక్సెస్ ఫార్ములాను కంటిన్యూ చేస్తూ సందీప్ కిషన్ తో మరో మారు భారీ సక్సెస్ ని సాధించడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇదిలా ఉంటే గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం…సందీప్ కిషన్, రావు రమేష్ తండ్రి కొడుకులుగా నటించిన ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు మొత్తం ఎంటర్టైనర్ గా కొనసాగినట్టుగా ట్రైలర్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. తండ్రి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, కొడుకు మరొక అమ్మాయిని లవ్ చేస్తాడు. వీళ్ళ ప్రేమ అనేది పెళ్లిగా మారుతుందా? లేదా అనే ఒక సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మరోసారి అవే కమర్షియల్ సినిమా ఎలిమెంట్స్ అయితే మనకు ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక మూడు ఫైట్లు, నాలుగు పాటలు, ఐదు కుళ్లు జోకులతో ఈ సినిమాని లాగించినట్టుగా తెలుస్తోంది…
త్రినాధ్ రావు నక్కిన ప్రసన్నకుమార్ బెజవాడ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో మనం అంతకంటే ఎక్కువగా ఏం ఎక్స్ పెక్ట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళ సినిమాలు రొటీన్ రొట్ట ఫార్ములాలో సాగే కమర్షియల్ సినిమాలుగా వస్తూ ఉంటాయి. అందువల్లే వీళ్ళ సినిమాలను చూడడానికి చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపించరు.
బి సి ప్రేక్షకుల్లో మాత్రం వీళ్ళ సినిమాలకు ఎక్కువగా ఆధరణ అయితే లభిస్తుంది. తద్వారా ఈ సినిమాలో కొంత కొత్త ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ చేస్తే మాత్రం సినిమా ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. లేకపోతే మాత్రం ఈ సినిమా మరోసారి డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ముఖ్యంగా సందీప్ కిషన్ ఒక కొత్త యాంగిల్ లో మనకు ఈ సినిమాలో కనిపించబోతున్నాడనేది ఈ ట్రైలర్ చూస్తే చాలు మనకు ఈజీగా అర్థమైపోతుంది.
ఇక ఎమోషనల్ సీన్స్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేసినట్టుగా ఈ మూవీ ట్రైలర్ లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మొత్తానికైతే ఈ సినిమా రొటీన్ రొట్ట ఫార్ములా లో ఉన్నప్పటికి సగటు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉండబోతుందనే విషయమైతే మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది…