https://oktelugu.com/

Nagababu: నాగబాబు తన అల్లుడికి ఇచ్చిన కట్నకానుకలు ఇవే !

Nagababu: మెగా నట వారసురాలు ‘నిహారిక’ పెళ్లి, గుంటూరు మాజీ ఐజీ జొన్నల గడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే, నీహారిక పెళ్లి వేడుక రోజు.. పెళ్లికూతురు నిహారికకు మెగాస్టార్ చిరంజీవి ఓ వజ్రాల హారాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ వజ్రాల హారం ధర ఏకంగా రెండు కోట్ల రూపాయలు. ఇక వరుణ్ తేజ్ కూడా తన చెల్లెలి కోసం రెండు కోట్ల రూపాయల విలువైన ప్లాట్ ను […]

Written By:
  • Shiva
  • , Updated On : March 18, 2022 / 05:10 PM IST
    Follow us on

    Nagababu: మెగా నట వారసురాలు ‘నిహారిక’ పెళ్లి, గుంటూరు మాజీ ఐజీ జొన్నల గడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే, నీహారిక పెళ్లి వేడుక రోజు.. పెళ్లికూతురు నిహారికకు మెగాస్టార్ చిరంజీవి ఓ వజ్రాల హారాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ వజ్రాల హారం ధర ఏకంగా రెండు కోట్ల రూపాయలు. ఇక వరుణ్ తేజ్ కూడా తన చెల్లెలి కోసం రెండు కోట్ల రూపాయల విలువైన ప్లాట్ ను బహుమతిగా ఇచ్చాడు. అలాగే బాబాయ్ పవన్ సైతం ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు.

    Niharika Konidela

    మరి నాగబాబు తన అల్లుడు చైతన్యకి ఏమి ఇచ్చాడో తెలుసా ?

    నిజంగానే నాగబాబు తన అల్లుడి చైతన్యకి ఏమి ఇచ్చాడనే ఆసక్తి మెగా అభిమానుల్లో కూడా ఎక్కువగా ఉంది. అయితే, నాగబాబు తన అల్లుడికి లాంఛనం పేరుతో కానుకలు ఇచ్చారు. ఆల్ రెడీ నిహారిక పేరు మీద మూడు కోట్ల రూపాయల విలువ చేసే ఓ భవంతి ఉందట. ఆ భవంతితో పాటు అలాగే 10 కోట్ల రూపాయల నగదును, ఇక రెండు కోట్ల విలువ
    చేసే బంగారాన్ని కూడా చైతన్యకి కట్నంగా నాగబాబు ఇచ్చారని తెలుస్తోంది.

    Also Read:  రవితేజకు కూడా రెండు డేట్లు ఎందుకయ్యా ?

    అయితే, ఇవి కట్నంగా కాకుండా… నిహారిక పేరు మీదే రిజస్టర్ చేసి ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. ప్రముఖుల కుటుంబాల్లో కట్నం అనే పేరు ఉండదు. ఆ పేరును ఎత్తకుండా లాంఛనం పేరుతో అల్లుడికి కూతురికి ఆస్తులు పంచుతూ ఉంటారు. ఇక నాగబాబుకు నిహారిక అంటే ప్రాణం. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ‘నీహారికతో మీకున్న బాండింగ్ గురించి చెప్పమని యాంకర్ అడిగితే నాగబాబు చాలా ఎమోషనల్ అవుతూ చెప్పారు.

    Nagababu

    నిహారిక గురించి నాగబాబు మాటల్లోనే.. ‘వరుణ్ తేజ్ పుట్టిన తర్వాత నాకు ఇక కొడుకు వద్దనుకుని అమ్మాయే కావాలని బలంగా కోరుకున్నాను. లక్కీగా నిహారిక ా పుట్టింది. నిహారిక నాకు బెస్ట్ ఫ్రెండ్. నిజానికి నాకు నా భార్య, నా కొడుకుతో కన్నా.. నిహారికతోనే ఎక్కువ బాండింగ్ ఉంది. అలాగే నాకు నిహారికతోనే ఎక్కువ కమ్యూనికేషన్ ఉండేది’ అని నాగబాబు ఎమోషనల్ అవుతూ చెప్పారు.

    ఇక నిహారిక పెళ్లి రోజు అయితే, తన కూతురు తనకు దూరం అవుతుంది అని నాగబాబు కన్నీళ్లు పెట్టుకున్నారట. పెళ్లి వేడుకలో కల్యాణ తిలకంతో నిహారిక భావోద్వేగాలను , కూతురి సంతోషాన్ని చూస్తూ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు నాగబాబు. తన జీవితంలో అవి మధురమైన క్షణాలు నాగబాబు ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారు.

    Also Read: ఎక్స్ గ్రేషియా వ‌ద్దు.. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల్సిందే..

     

     

    Tags