Homeజాతీయ వార్తలుAam Admi In Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ కు షాకిస్తూ ఆమ్ ఆద్మీ రె‘ఢీ’

Aam Admi In Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ కు షాకిస్తూ ఆమ్ ఆద్మీ రె‘ఢీ’

Aam Admi In Telangana: తెలంగాణలో కొత్త పార్టీలకు అవకాశం లేదని, తెలంగాణ రాష్ట్ర సమితిని తప్ప తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మరని అధికార పార్టీ నేతల్లో ఒక ధీమా. ఎన్నికలు ఏవైనా.. టీఆర్‌ఎస్‌నే గెలిపిస్తారనే విశ్వాసం. ఎన్నికలు ఎలా జరుగుతున్నాయనే విషయం పక్కన పెడితే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు మినహాయిస్తే ప్రతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మాత్రం కొనసాగుతోంది. అయితే కొత్త పార్టీలు మాత్రం తెలంగాణపై దృష్టి పెడుతున్నాయి. ఏడాది క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి తనయ షర్మిల కొత్త పార్టీ ప్రారంభించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ జేఏసీ చైర్మన్‌ తెలంగాణ జన సమితి పేరుతో పార్టీ పెట్టారు. ఎన్నికల్లో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో రాష్ట్రంలో కొత్త పార్టీలకు స్థానం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ పంజాబ్‌ ప్రజలు ఇచ్చిన తీర్పు పార్టీ కొత్తదా, పాతదా కాదు. ఎజెండా, పాలన ఎలా ఉంటుంది అన్నదే ఆలోచిస్తారన్న విషయాన్ని బహిర్గతం చేసింది. నాయకులకుంటే ఓటర్లు విజ్ఞులు అన్న విషయాన్ని రుజువ చేసింది. ఇదే సమయంలో పంజాబ్‌లో విజయం ఆప్‌ పార్టీకి కొత్త ఊపు తెచ్చింది. ఇదే ఊపుతో పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలంగాణపై దృష్టిపెట్టినట్లు సమాచారం.

Also Read: Hero Sumanth: ‘పూరి’ని మూడు సార్లు రిజెక్ట్ చేసిన ఏకైక ప్లాప్ హీరో

 

Aam Admi In Telangana
Aam Admi In Telangana

-ఏప్రిల్‌ 14 నుంచి ఆప్‌ పాదయాత్ర
దేశంలో రెండు రాస్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక ప్రాతీయ పార్టీ ఆప్‌. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో జోరుమీద ఉన్న ఆప్‌ పార్టీ దక్షనిణాదిలో పార్టీని విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాదగంగా ముందుగా తెలంగాణపైనే ఫోకస్‌ పెట్టింది. తెలంగాణలో ముందస్తు రాజకీయం నడుస్తున్న నేపథ్యంలో దక్షిణాదిలో తమ అదృష్టాన్ని తెలంగాణ నుంచే పరీక్షించుకునేందుకు పార్టీ అధిష్టానం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 14 నుంచి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల మీదుగా సాగేలా పాదయాత్ర చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ పాదయాత్రను పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిద్‌ కేజ్రీవాల్‌ ఏప్రిల్‌ 14న ప్రారంభిస్తారని సమాచారం. ఆప్‌ తెలంగాణ ఇన్‌చార్జి సోమనాథ్‌ ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈమేరకు రూట్‌మ్యాప్‌ రెడీ చేస్తున్నారు.

– వీలైతే సొంతగా.. లేదంటే పొత్తులతో..
ఆప్‌ పార్టీకీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. నీటివంతమైన పాలన అందిస్తారనే విశ్వాసం ఉంది. పార్టీలో ఎమ్మల్యేలకు అవినీతి మచ్చ లేకపోవడమే ఇందుకు కారణం. ఇదే పార్టీకి పెద్ద బలం కూడా. మరోవైపు ప్రజలకు ఏది అవసరమో గుర్తించడంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నిష్ణాతులు. ఇతర ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ నాయకుల్లా ఉచిత హామీలు, ఎన్నికల్లో గెలవడం కోసం ఇష్టానుసారం ఎజెండాలు ప్రకటించరు. ప్రజలకు ఏది అవసరమో.. ఎలాంటి పాలన కోరుకుంటున్నారో తెలుసుకుంటారు. అందులో భాగంగానే తెలంగాణలో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్ర తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా.. ప్రజలు ఆశిస్తున్నది ఏమిటి… వారి ఆకాంక్షలు ఏమిటి. సొంతంగా పోటీచేస్తే గెలుస్తామా.. ఎవరిని కలుపుకుపోవాలనే విషయాల్లో ఒక అంచానాకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ్‌కి నేత కావాలని కలలు కంటుంటే ఆప్‌ చీఫ్‌ మాత్రం తెలంగాణపై ఫోకస్‌ పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Also Read: BJP Parthasarathi: ‘రాయలసీమ రణభేరి’ మోగించిన బీజేపీ

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] Brahmapureeswarar Temple: ఈ సృష్టికి మూలం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులంటారు. శివుడికి దేవాలయాలున్నాయి. విష్ణువుకు గుళ్లున్నాయి. కానీ బ్రహ్మకు మాత్రం ఆలయాలు లేవు. ఇది ఆయనకు ఉన్న శాపంగా చెబుతుంటారు. బ్రహ్మ దేవుడి అహంకారంతోనే ఆయనకు ఆలయాలు లేకుండా పోయాయనేది పురాణాల ద్వారా తెలుస్తోంది. అందరిని సృష్టించే బ్రహ్మకు తలపొగరు నెత్తికెక్కడంతోనే ఆయన పోటీలో ఓడి తనకు దేవాలయాలు లేకుండా చేసుకున్నాడనేది ఇతిహాసాల సారాంశం. మరి మన సృష్టికే లయకారకుడైన బ్రహ్మకు ఉన్న ఆలయాలు బహుతక్కువే. వేళ్ల మీద లెక్కించొచ్చు. […]

  2. […] Corona Cases In China: కరోనా పీడ ఇక వదిలినట్లేనని అనుకున్నారు.. ప్రజలంతా ఎప్పటిలాగే తమ పనులు చేసుకుంటున్నారు.. కానీ ఇంతలోనే మహమ్మారి మళ్లీ ముంచుకొస్తుంది.. కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి కరోనా కేసులు విజృంభించడంతో ప్రపంచం షాక్ కు గురైంది. గత వారం రోజులగా చైనాలో లాక్డౌన్ విధించడంతో కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదని అర్థమవుతోంది. గత రెండేళ్లుగా కరోనాతో ప్రపంచం అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకుంటున్న క్రమంలో మరోసారి కేసులు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. అటు లాక్టౌన్ విధించడంతో ఎక్కడి వ్యాపారాలు అక్కడే ఆగిపోయాయి. దీంతో చైనానే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆందోళన నెలకొంది. అయితే చైనాలో నెలకొన్న సంక్షోభంతో ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి..? అందుకు గల కారణం ఏంటి..? అన్న దానిపై స్పెషల్ ఫోకస్ […]

Comments are closed.

Exit mobile version