Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇమేజ్ తారాస్థాయిలో ఉందనే చెప్పాలి. ఆయన కోసం ఆయన ఫ్యాన్స్ ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి పాపులారిటీని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకుంటు వస్తున్నాడు. ఇక హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ ప్రస్తుతం పీక్స్ లో ఉందనే చెప్పాలి. 10 సంవత్సరాల పాటు ఒక్క హిట్టు లేకపోయిన కూడా తన ఫ్యాన్స్ ని పెంచుకున్నాడే తప్ప , తగ్గించుకోని ఒకే ఒక హీరో పవన్ కళ్యాణ్..
ఈయనని బీట్ చేసే హీరో ప్రస్తుతం తెలుగులో లేడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన మేనరిజమ్స్ ను గాని, ఆయనలో ఉన్న చరిష్మాని గాని పూర్తిగా వాడుకొని సూపర్ హిట్లు కొట్టిన దర్శకులు కొందరు మాత్రమే ఉన్నారు. మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చిన కూడా ఆయనతో ఎలాంటి సినిమా చేయాలో తెలియక ఆయనకు ప్లాపులు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్టామినాని బాగా వాడుకొని సక్సెస్ లను అందించిన దర్శకులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళెవరో ఒకసారి మనం తెలుసుకుందాం…
పూరి జగన్నాథ్
బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ యొక్క స్టైల్ ను గాని,ఆయన డైలాగ్ డెలివరీ ని గాని మొత్తాన్ని మార్చేసి తనలో ఉన్న నటుడిని పూర్తిగా వాడుకొని పూరి జగన్నాథ్ ఈ సినిమాతో ఒక భారీ బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు. దీని ద్వారా పవన్ కళ్యాణ్ కూడా స్టార్ హీరోగా తనని తాను పోట్రే చేసుకున్నాడు…
హరీష్ శంకర్
అప్పటిదాకా పవన్ కళ్యాణ్ ను అతని అభిమానులు ఎలాగైతే చూడాలి అనుకుంటున్నారో గబ్బర్ సింగ్ సినిమాతో సరిగ్గా అలాగే చూపించి ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని పవన్ కళ్యాణ్ ఖాతాలో వేసిన దర్శకుడు హరీష్ శంకర్..ఇక తెలుగు లో కమర్షియల్ సినిమాలను ఎలాంటి మీటర్ మీద తీయాలో ఈ డైరెక్టర్ కి తెలిసినంతగా మరేవరికి తెలియదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు..
త్రివిక్రమ్ శ్రీనివాస్
జల్సా, అత్తారింటికి దారేది సినిమాల్లో ఆయనలో ఉన్న కామెడీని గాని, యాక్షన్ ని గాని పూర్తిగా వాడుకొని ఆ సినిమాలని విజయతీరాలకు చేర్చాడు. ఆయన రాసిన డైలాగులను పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ వే లో డెలివరీ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కి ఒక సపరేట్ స్టైల్ ని కూడా క్రియేట్ చేశాడు…
ఇక పవన్ కళ్యాణ్ కి ఎవరు ఎన్ని హిట్లు, ప్లాపులు ఇచ్చిన కూడా ఆయన్ని వీళ్ళు ముగ్గురు ఎలివేట్ చేసినంతగా మరే దర్శకుడు చేయలేదనే చెప్పాలి…