https://oktelugu.com/

Spirit: స్పిరిట్ సినిమాలో కీలక పాత్ర లో కనిపించనున్న బాలీవుడ్ స్టార్ హీరో…

అక్షయ్ కుమార్ కూడా నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో చాలా సినిమాలకి కమిటై ఉన్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 10, 2024 / 05:53 PM IST

    Spirit

    Follow us on

    Spirit: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా తన కంటు ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన కల్కి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు.

    అయితే ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో అక్షయ్ కుమార్ కూడా నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో చాలా సినిమాలకి కమిటై ఉన్నాడు. అయినప్పటికీ డేట్స్ అడ్జెస్ట్ అవ్వలేకపోయినా కూడా స్పిరిట్ చేయమా కోసం సందీప్ రెడ్డి వంగ అడగగానే మొత్తానికైతే డేట్స్ అడ్జస్ట్ చేసి నేను ఈ సినిమా చేస్తాను అని పక్కాగా చెప్పాడట. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఇంతకుముందు చేసిన అనిమల్ సినిమాలో నటించిన ‘బాబి డియోల్ ‘ గాని రన్బీర్ కపూర్ కి గానీ మంచి గుర్తింపు వచ్చింది. అందువల్లే అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు.

    మరి ఈ సినిమాలో అక్షయ్ పోషించే పాత్ర ఏంటి అనేదాని మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ వంగ ఈ సినిమాని అర్జున్ రెడ్డి , అనిమల్ సినిమాల కంటే సూపర్ డూపర్ సక్సెస్ ని చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో తను మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవడానికి కూడా సిద్ధమవుతున్నాడు…

    ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ సంవత్సరం రెండు సినిమాలను రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. ఇక ఇప్పటికే రాజసాబ్ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక కల్కి చెందిన షూటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కాబట్టి ఈ రెండు సినిమాలని ఈ సంవత్సరం రిలీజ్ చేసి వచ్చే సంవత్సరం హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చే సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నాడు…ఇక ఈ రెండు సినిమాలతో ప్రభాస్ చాలా బిజీగా మారనున్నట్టుగా తెలుస్తుంది…