Tollywood Directors: వరుసగా 5 కంటే ఎక్కువ సినిమాలు తీసి సక్సెస్ లు కొట్టిన ప్రస్తుత డైరెక్టర్లు వీళ్లే…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి రాజమౌళి గురించి తెలుసు ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అలాంటివి...ఆయన ప్రతి సినిమాని చాలా గొప్పగా తీసే ప్రయత్నం అయితే చేస్తాడు.

Written By: Gopi, Updated On : October 5, 2023 9:59 am

Tollywood Directors

Follow us on

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులలో కొంతమంది దర్శకులు మాత్రం వాళ్లకు నచ్చిన సినిమాలను జనం మెచ్చే విధంగా తీస్తూ సక్సెస్ లను ఈజీగా అందుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం సక్సెస్ సినిమాలు తీయడంలో పూర్తిగా ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటివారు ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో కొనసాగాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్లు ప్రూవ్ చేసుకుంటూ రావాలి. అంటే హిట్ సినిమాలు తీస్తూ ఉండాలి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లను మినహాయిస్తే వరుస హిట్లు ఇచ్చే డైరెక్టర్లు ఇండస్ట్రీ లో లేరనే చెప్పాలి… అందుకే ఒక బ్లాక్ బస్టర్ హిట్టు తీసిన డైరెక్టర్ కి కూడా తర్వాత అసలు సినిమాలు చేసే అవకాశం రావడం లేదు. ఎందుకంటే ఒక హిట్ సినిమా తీసి ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ సినిమాలు తీస్తున్నారు.ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా లేని డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి మనం తెలుసుకుందాం…

రాజమౌళి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి రాజమౌళి గురించి తెలుసు ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అలాంటివి…ఆయన ప్రతి సినిమాని చాలా గొప్పగా తీసే ప్రయత్నం అయితే చేస్తాడు. అందులో భాగంగానే ఆయనకి చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఇక ఇప్పటివరకు ఆయన తీసిన 12 సినిమాల్లో 12 సినిమాలు కూడా వరుస విజయాలను అందుకుంటూ తనదైన మార్క్ ను సంపాదించుకుంటు వచ్చినవే..

అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి కూడా ఇండస్ట్రీ లో ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ అనిల్ రావిపూడి కి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేదు. ఈయన తీసిన సినిమాలు వరుసగా సక్సెస్ లు సాధించాయనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఇప్పుడు భగవంత్ కేసరి అనే సినిమాతో దసరాకి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే వరుసగా ఆయన ఏడు సినిమాలు హిట్టు కొట్టిన డైరెక్టర్ గా మంచి పేరును సంపాదించుకుంటాడు. అలాగే బాలయ్య కి కూడా ఒక మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ గా నిలిచిపోతాడు…ఈయన సినిమాలు ఎక్కువగా కామెడీ ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఈయన సినిమాలు ఈజీగా జనాల్లో కనెక్ట్ అవుతు ఉంటాయి. అందుకే ఈయన వరుసగా సక్సెస్ లు సాధిస్తూ వస్తున్నాడు.ఇక దానికి తోడు ఆయన తన సినిమాల్లో కామెడీ జోడించి ప్రతి క్యారెక్టర్ కి సపరేట్ మ్యనరిజం ని పెట్టి కామెడీని చేయిస్తాడు.అందుకే అనిల్ రావిపూడి సినిమాలు మంచి ఆదరణను అందుకుంటున్నాయి. ఇక ఇప్పటివరకు ఐదు కంటే ఎక్కువ సినిమాలు తీసి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుసగా హిట్లు కొట్టిన డైరెక్టర్లలో వీళ్ళిద్దరు డైరెక్టర్లు మాత్రమే ఉన్నారు. ఇంకా ఫ్యూచర్ లో ఎవరైనా డైరెక్టర్ వీళ్ళతోపాటు ఆడ్ అవుతారేమో చూడాలి…