Shikhar Dhawan: ఆ క్రికెటర్ ను టార్చర్ చేసిన భార్య.. విడాకులు మంజూరు చేసిన కోర్టు…

కొందరు మాత్రం శిఖర్ ధావన్ ని తొక్కడానికే బిసిసిఐ ఇలా చేస్తుంది. అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో శిఖర్ ధావన్ కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్ట్ విడాకులను మంజూరు చేసింది.

Written By: Gopi, Updated On : October 5, 2023 10:16 am

Shikhar Dhawan

Follow us on

Shikhar Dhawan: ఇండియన్ క్రికెటర్ అయినా శిఖర్ ధావన్ అప్పట్లో ఇండియన్ టీం కి ఒంటి చేత్తో విజయాలను అందించాడు. ఈయన ఓపెనర్ ప్లేయర్ గా తన సత్తా ఏంటో చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు.రోహిత్ శర్మ తో పాటు ఓపెనింగ్ చేసే ధావన్ ఫస్ట్ బౌలర్లను చాలా దాటి గా ఎడురుకుంటాడు…ఐసీసీ నిర్వహించే మ్యాచుల్లో కూడా ధావన్ కి మంచి రికార్డ్ లు ఉన్నాయి.ఇక అలాంటి శిఖర్ ధావన్ ని బిసిసిఐ వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేయకపోవడం అనే విషయమే చాలా బాధ ని కల్గించే విషయం…ఎందుకంటే ఆయనకి ఐసీసీ ట్రోఫీలో మంచి రికార్డు ఉంది అలాంటి శిఖర్ ధావన్ ని పక్కన పెట్టి బిసిసిఐ చాలా పెద్ద తప్పు చేసింది అంటూ చాలామంది క్రికెట్ అభిమానుల సైతం బీసీసీఐ ని తప్పుబట్టారు. ఇక ఇలాంటి టైంలో వరల్డ్ కప్ లకి కూడా శిఖర్ ధావన్ ని బీసీసీఐ ఏ సీరీస్ లకి సెలెక్ట్ చేయడం లేదు ఎందుకు అనేది ఎవరికీ తెలీదు. అయితే ఆయన ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ ఆయన్ని సెలెక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి అనేది చాలామందికి అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

కొందరు మాత్రం శిఖర్ ధావన్ ని తొక్కడానికే బిసిసిఐ ఇలా చేస్తుంది. అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో శిఖర్ ధావన్ కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్ట్ విడాకులను మంజూరు చేసింది.తన భార్య అయిన అయేషా ముఖర్జీ గత కొద్ది రోజులుగా శిఖర్ ధావన్ ని మానసికంగా హింసిస్తుందని ఆయన విడాకులకు అప్లై చేయడం జరిగింది. అయితే ఆయేషా ముఖర్జీ కొద్దిరోజుల పాటు తన కొడుకుతో ఒంటరిగా ఉంటానని అలాగే ఆయన్ని చాలా రకాలుగా మానసికంగా వేధిస్తుంది అంటూ ఆయన మెన్షన్ చేసిన వర్డ్స్ మీద డీప్ గా అనాలసిస్ చేసిన న్యాయ స్థానం శిఖర్ ధావన్ వ్యాఖ్యలను అర్థం చేసుకొని ఫ్యామిలీ కోర్టు వాళ్లకు విడాకులను మంజూరు చేయడం జరిగింది. అయితే ఆస్ట్రేలియాలో ఉన్న ఆయన కొడుకుని చూడటానికి సెలవు దినాల్లో ఇండియాకు తీసుకురావాలని చెప్పడం జరిగింది…

ధావన్ కి ప్రస్తుతం చాలా బ్యాడ్ టైం నడుస్తుంది అనే చెప్పాలి. అటు కెరియర్ పరంగా క్రికెట్ లో అవకాశాలు రావడం లేదు ఇటు ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ విడాకులు తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆటగాడు మానసికంగా కృంగిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. శిఖర్ ధావన్ పరిస్థితి కూడా అలానే ఉంది ఒకేసారి అటు కెరియర్,ఇటు లైఫ్ రెండు కూడా తన నుంచి జారిపోవడం చాలా భాద కరమైన విషయం అనే చెప్పాలి…

ఇక ఈ బ్యాడ్ టైం నుంచి ఆయనకు గుడ్ టైం రావాలంటే మళ్ళీ ధావన్ క్రికెట్ ప్రాక్టీస్ బాగా చేసి ఇండియన్ టీం లో ప్లేస్ సంపాదించుకుంటే తప్ప అతనికి మానసికమైన ఆనందం ఉండదు అని క్రికెట్ పండితులు సైతం తెలియజేయడం జరుగుతుంది…