‘అక్కినేని సమంత’ తాజాగా ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ కి సంబదించిన సీక్రెట్స్ ను చాల క్లారిటీగా చెప్పుకొచ్చింది. ఏమిటి ఆ సీక్రెట్స్ అంటే.. సామ్ మాటల్లోనే ‘నా కెరీర్ ప్రారంభించి 11 సంవత్సరాలు అవుతుంది. ఎంతో అనుభవం పొందాను. అయితే, గత కొంతకాలంగా నాలో కొన్ని ప్రధాన మార్పులు వచ్చాయి.
ఒకప్పుడు నాలో అభద్రతా భావంతో పాటు నేను తీసుకునే నిర్ణయాల పట్ల అనేక స్వీయ సందేహాలు ఉండేవి. ఐతే కొంతకాలంగా నేను వాటిని అధిగమించడం నేర్చుకున్నాను. అదే క్రమంలో నా అభద్రతా భావాలను తగ్గించుకోవడం అలవాటు చేసుకున్నాను. అలాగే సినీ కెరీర్ కు సంబంధించి స్వేచ్ఛగా ఇప్పుడు రిస్క్‌లు తీసుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇవన్నీ నాలో కొత్తగా వచ్చిన మార్పులు.
నాలో వచ్చిన ఈ మార్పులు కారణంగా నా పై నాకు నమ్మకం పెరిగింది అంటూ సామ్ గర్వంగా చిన్నపాటి సిగ్గుతో చెప్పుకొచ్చింది. ఇక సమంత తన మైథాలాజికల్ మూవీ ‘శాకుంతలం’ కోసం జులై 5 నుండి డేట్లు ఇచ్చింది. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగనుంది. ఇక ఈ సినిమా కోసం సమంత బాగా కష్టపడుతుంది.
ఇప్పటికే కేవలం ఈ సినిమా కోసం నాలుగు కేజీలు బరువు కూడా తగ్గింది. పైగా ఈ సినిమాలో భారీ ఆభరణాలు ధరించి, కొన్ని సన్నివేశాల్లో బోల్డ్ గా కూడా నటించబోతుంది. మొత్తానికి తన కెరీర్ లోనే ఇది స్పెషల్ ఫిల్మ్ గా సామ్ భావిస్తోంది. పైగా ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ సినిమా షూటింగ్ యాభై శాతం పూర్తయింది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుతో కలసి గుణ శేఖర్ తనయ నీలిమ గుణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి తెగ కష్టపడుతుంది.