అయితే, అనిత తరచూ తనకు సంబంధించిన విషయాలను, విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ కి మంచి టైమ్ పాస్ కంటెంట్ ఇస్తోంది. ఈ క్రమంలో తన భర్త రోహిత్ రెడ్డిని సరదాగా ఆటపట్టించే వీడియోలు, తన ముద్దుల తనయుడి ఫొటోలను కూడా అనిత షేర్ చేస్తూ తెగ హడావిడి చేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో అనిత తన భర్తను ఆటపట్టిస్తూ ఉండగా దాన్ని వీడియో తీశారు. ఆ వీడియోని అనిత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. అన్నట్టు తాజాగా అనిత తన భర్తతో క్లోజ్‌గా తీసుకున్న ఫోటో ఒకదాన్ని పోస్ట్ చేసింది. అనిత ఎప్పుడైతే ఆ ఫోటోను షేర్ చేసిందో ఆ ఫోటోకి విపరీతమైన లైక్స్ అండ్ షేర్స్ వస్తున్నాయి.
పనిలో పనిగా అనిత ఈ ఫోటో పోస్ట్ చేస్తూనే ఒక మెసేజ్ కూడా పెట్టింది. ‘ఈ లోకంలో అందరి కంటే నన్ను ఎక్కువగా ఏడిపించేది నువ్వే. అందుకే నీకు చిరాకు తెప్పించే ప్రతి మూమెంట్ లో నేను నీతో ఉండాలనుకుంటాను’ అంటూ తనలోని భావాలను అనిత ఎలాంటి మొహమాటం లేకుండా చక్కగా పద్దతిగా రాసుకొచ్చింది.
పైగా ఈ మెసేజ్ కి నవ్వుతున్న ఎమోజీలను కూడా జోడించింది. ఇంతకీ అనిత భర్త ఒక బిజినెస్ మేన్. పేరు రోహిత్ రెడ్డి. ఇతన్ని ప్రేమించి 2013లో వివాహం చేసుకుంది అనిత. ఇటీవల ఈ జంట పండంటి మగబిడ్డకు జన్మించారు.