https://oktelugu.com/

ఏపీతో ‘నీటి’ఫైట్: ఓట్ల కోసమేనా?

కృష్ణా జలాల వివాదం ఒక్కసారిగా చెలరేగడం.. తెలంగాణ-ఏపీ మధ్య అగ్గిరాజుకోవడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఇదంతా సీఎం కేసీఆర్ ఓట్ల కోసమే చేస్తున్నారన్న వాదన తెరపైకి వస్తోంది. సీఎం కేసీఆర్ వ్యూహాన్ని కొత్తగా తెలంగాణ పీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డి బయటపెట్టారు. సీఎం కేసీఆర్ నాడు నేడు తెలంగాణ సెంటిమెంట్, మనోభావాలు రెచ్చగొట్టి ఓట్లు పొందారని ఇప్పుడూ ఏపీతో నీటి కొట్లాటతో మనోభావాలు రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల ఓటర్లను ఆకక్షించేందుకే కృష్ణా నది నీరు వివాదాన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : July 2, 2021 10:02 am
    Follow us on

    కృష్ణా జలాల వివాదం ఒక్కసారిగా చెలరేగడం.. తెలంగాణ-ఏపీ మధ్య అగ్గిరాజుకోవడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఇదంతా సీఎం కేసీఆర్ ఓట్ల కోసమే చేస్తున్నారన్న వాదన తెరపైకి వస్తోంది. సీఎం కేసీఆర్ వ్యూహాన్ని కొత్తగా తెలంగాణ పీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డి బయటపెట్టారు.

    సీఎం కేసీఆర్ నాడు నేడు తెలంగాణ సెంటిమెంట్, మనోభావాలు రెచ్చగొట్టి ఓట్లు పొందారని ఇప్పుడూ ఏపీతో నీటి కొట్లాటతో మనోభావాలు రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల ఓటర్లను ఆకక్షించేందుకే కృష్ణా నది నీరు వివాదాన్ని సృష్టించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘తెలంగాణ ప్రజలకు కృష్ణా నీరు అనేది ఒక జీవితంలో భాగం.. అత్యవసరం.. కానీ కేసీఆర్ దీన్ని కూడా ఓట్ల కోసం వాడుకుంటున్నారు. ఎన్నికలు జరిగినప్పుడల్లా కేసీఆర్ ఈ నీటి వివాదాన్ని లేవనెత్తుతున్నారు’ అని పేర్కొన్నారు.

    తెలంగాణలోని కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు రోజుకు ఒక టీఎంసీని మాత్రమే ఉపయోగించుకోగలవని.. కానీ ఆంధ్రా సీఎం జగన్ మాత్రం రోజుకు 11 టీఎంసీలు తీసుకుపోవాలని ప్రాజెక్టులు కడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ఇక్కడే కేసీఆర్.. తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రా కోసం తనఖా పెడుతున్నారని ఆరోపించారు.

    నిజంగా కేసీఆర్ కు ప్రేమ ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పిటీషన్ ఎందుకు దాఖలు చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. ఒక సాధారణ రైతు శ్రీనివాస్ ఈ పని చేశాడని.. పోరాడుతున్నాడని తెలిపాడు. శ్రీనివాస్ కు అనుకూలంగా తీర్పు వచ్చాకే కేసీఆర్ హడావుడి చేస్తున్నాడని రేవంత్ ఆరోపించారు.

    జగన్ ఇంటికి పిలిచి సన్మానించి భోజనం పెట్టినప్పుడు ఇదంతా గుర్తుకురాలేదా? అని రేవంత్ ప్రశ్నించాడు. వైఎస్ఆర్ ను మంత్రులు తిట్టడం కరెక్ట్ కాదని రేవంత్ కౌంటర్ ఇచ్చాడు.