Tollywood: సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నటులు ఇక్కడ రాణించాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలని భావిస్తూ ఉంటారు. ఆ ఉద్దేశ్యం తోనే న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ పేర్లని మార్చుకుంటే అదృష్టం తనను వరిస్తుందని భావిస్తూ ఉంటారు. ఇక అలా పేరు మార్చుకొని సక్సెస్ అయినవాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…
ఇండస్ట్రీ లో పేరు మార్చుకున్న సక్సెస్ అయిన వాళ్లలో మొదటగా మనకు గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తన పేరు మార్చుకున్నాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. ‘శివ శంకర వరప్రసాద్ ‘గా ఉన్న ఆయన పేరు ను స్క్రీన్ నేమ్ గా చిరంజీవి అని మార్చుకున్నాడు. దాంతో ఆయనకి వరుసగా సక్సెస్ లు రావడమే కాకుండా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు నెంబర్ వన్ హీరో గానే కొనసాగుతున్నాడు.
ఇక చిరంజీవి రూట్లోనే మరొక నటుడు కూడా తన పేరుని చేంజ్ చేసుకొని సక్సెస్ ఫుల్ హీరోగా చాలా కాలం పాటు కొనసాగాడు. ఆయన ఎవరు అంటే మోహన్ బాబు. ఈయన అసలు పేరు ‘భక్తవత్సలం నాయుడు ‘ కానీ స్క్రీన్ నేమ్ గా ఆ పేరు పనిచేయదనే ఉద్దేశ్యంతో దాసరి నారాయణరావు భక్తవత్సలం నాయుడుగా ఉన్న పేరుని మోహన్ బాబు గా మార్చాడు.
దాంతో అప్పటినుంచి ఆయన వరుసగా ఆఫర్లు అందుకుంటూ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ సక్సెస్ లు సాధించాడు. ఇక ఆ తర్వాత హీరోగా కూడా మంచి విజయాలను అందుకున్నాడు. ఇక వీళ్ల రూట్లోనే నడిచిన మరొక హీరో రవితేజ. ఈయన అసలు పేరు ‘రవి రాజా శంకర్’ కానీ స్క్రీన్ నేమ్ గా రవితేజ అని పెట్టుకున్నాడు. దాంతో ఈయన కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ప్రస్తుతం అదే స్టార్ డమ్ ను కంటిన్యూ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక వీళ్ళ బాటలోనే నడిచిన మరో యంగ్ హీరో నాని. ఈయన అసలు పేరు ‘నవీన్ ‘ కానీ స్క్రీన్ నేమ్ గా నాని అని మార్చుకున్నాడు. దాంతో ఈయన కూడా సక్సెస్ ఫుల్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు…