https://oktelugu.com/

Manchu Manoj: మంచు మనోజ్ అన్నది మంచు విష్ణునేనా? ఆ గొడవేంటి..?

సంపూర్ణేష్ బాబు ఒక మాటల్లో స్వచ్ఛదనం ఉంటుంది, ఆయన నిజాయితీ ఆ నవ్వులోనే కనిపిస్తుంది అంటూ మనోజ్ సంపూర్ణేష్ బాబు గురించి చాలా గొప్పగా చెప్పారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 25, 2023 / 10:38 AM IST

    Manchu Manoj

    Follow us on

    Manchu Manoj: సంపూర్ణేష్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రలు గా నటిస్తున్న సోదర అనే సినిమా సాంగ్ లంచ్ చేయడానికి ముఖ్య అతిథిగా మనోజ్ వచ్చారు…ఇక ఈ సినిమా సాంగ్ లాంచ్ చేస్తూ మంచు మనోజ్ మాట్లాడుతూ సంపూర్ణేష్ బాబు ని చూస్తే సోదరుడి లాంటి భావన కలుగుతుంది. ఆయనను చూసినప్పుడు గానీ, ఆయన నవ్వుని చూసినప్పుడు గానీ మా ప్రసాద్ అన్న( బాబాయి కొడుకు ప్రమాదం లో చనిపోయారు) లాగా అనిపిస్తూ ఉంటారు. సంపూర్ణేష్ బాబు ఒక మాటల్లో స్వచ్ఛదనం ఉంటుంది, ఆయన నిజాయితీ ఆ నవ్వులోనే కనిపిస్తుంది అంటూ మనోజ్ సంపూర్ణేష్ బాబు గురించి చాలా గొప్పగా చెప్పారు…

    ఇక అలాగే బ్రదర్స్ మధ్య క్లారిటీగా ఉండాలి ఇద్దరి మధ్య ఇగో లు లేకుండా కలిసి మెలిసి ఉన్నప్పుడే వాళ్లు ఏ ప్రాబ్లం ని అయిన జయించగలుగుతారు. నలుగురిలో అయిన చాలా అన్యోన్యంగా ఉంటున్నారు అంటూ పేరు పొందుతారు.
    ఒకవేళ బ్రదర్స్ మధ్య ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గి కాంప్రమైజ్ అయి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అంతే తప్ప ఇద్దరు మధ్య మాటల్లేకుండా గొడవలు పెంచుకుంటూ పోతే ప్రాబ్లం అనేది ఇంకా పెరుగుతూ పోతుందే తప్ప తగ్గదు. అలా బ్రదర్స్ ఎప్పుడు కలిసి ఉండాలి. అలా ఉంటేనే ఫ్యామిలీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటూ బ్రదర్స్ గొప్పతనం గురించి చాలా బాగా చెప్పాడు…

    ఇక మంచు మనోజ్ చెప్పిన మాటలను విన్న తెలుగు ప్రేక్షకులు మనోజ్ అంత ఫీల్ అవుతూ బ్రదర్స్ గురించి చెప్తున్నాడు అంటే మనోజ్ కి, వాళ్ల అన్న మంచు విష్ణు కి మధ్య గొడవలు జరుగుతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇక అప్పట్లో వీళ్లిద్దరూ గొడవ పడిన వీడియో కూడా బయటకు వచ్చింది, కానీ ఆ తర్వాత అదంతా ప్రాంక్ వీడియో అని అన్నారు. కానీ మనోజ్ మాటలను వింటుంటే మాత్రం వీళ్ళిద్దరి మధ్య చాలా రకాలైన గొడవలు జరిగి ఇద్దరు మాట్లాడుకునే పరిస్థితిలో లేనట్టుగా కనిపిస్తున్నారు అందుకే మనోజ్ అంత ఎమోషనల్ గా మాట్లాడాడు అంటే చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు.

    మనోజ్ పెళ్లికి కూడా విష్ణు హాజరవలేదు అప్పటినుంచే వీళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. మరి ఫ్యూచర్ లో అయిన మంచు సోదరులు ఇద్దరు కలిసి మెలిసి ఉండి ఒకే వేదిక మీద మనకు కనిపిస్తారేమో చూడాలి… ఇక విష్ణు కన్నప్ప సినిమా లో బిజీ గా ఉండగా, మనోజ్ కూడా వాట్ ద ఫిష్ అనే సినిమా చేయడానికి కమిట్ అయ్యారు.అప్పట్లో సినిమా ఆగి పోయింది అనే మాటలు వినిపించాయి. మరి ఇప్పుడు షూటింగ్ జరుగుతుందా లేదా అనేది క్లారిటీ లేదు…