https://oktelugu.com/

Photo Story: జూనియర్ ఎన్టీఆర్ ఒళ్లో కూర్చున్న ఈ కుర్రాడి గురించి తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చాలా మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. మూడు తరాల వారు ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారూ ఉన్నారు. వారిలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన వారున్నారు. అక్కినేని నాగేశ్వర్ రావు ఆ తరువాత అక్కినేని నాగార్జున..

Written By:
  • Srinivas
  • , Updated On : November 25, 2023 / 10:49 AM IST
    Follow us on

    Photo Story: ఈ మధ్య సినీ చైల్డ్ ఆర్టిస్టుల ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కొంత మంది హీరో, హీరోయిన్లు తమ చిన్న నాటి ఫొటోలను బయటపెడుతుండడంతో వారి అభిమానులు వైరల్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఒకరు ఎంట్రీ ఇస్తే వారి వారసులకు ఎంట్రీ బోర్డు తప్పని సరిగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పరిశ్రమతో టచ్ ఉన్న వాళ్లు అప్పుడప్పుడు షూటింగ్ ప్రదేశాలకు వెళ్తుంటారు. అలా వెళ్లిన ఓ కుర్రాడిని ఇప్పటి స్టార్ హీరో ఎన్టీఆర్ ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. ఆ కుర్రాడు ఓ స్టార్ హీరో కొడుకు ఓ సందర్భంగా వీరు కలిసినప్పుడు కెమెరామెన్ క్లిక్ మనిపించాడు. అయితే ఇప్పుడు ఆ కుర్రాడు హీరోగా ఎదిగి పలు సినిమాల్లో నటించాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా?

    టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చాలా మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. మూడు తరాల వారు ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారూ ఉన్నారు. వారిలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన వారున్నారు. అక్కినేని నాగేశ్వర్ రావు ఆ తరువాత అక్కినేని నాగార్జున.. ఇప్పుడు ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ లు హీరోలుగా మారారు. వీరిలో అఖిల్ ఊహ తెలియని వయసులోనే కెమెరా ముందుకు వచ్చి నటించారు. సిసింద్రీలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అప్పుడే ఈయన సినీ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదుగుతారని అన్నారు. అయితే ప్రస్తుతం అఖిల్ కు సరైన అవకాశం రాలేదు.

    అఖిల్ పెరిగి పెద్దయ్యాక 2015లో ‘అఖిల్’ అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ తరువాత ‘హలో’ అనే మూవీతో పర్వాలేదనిపించాడు. అయితే ఆ తరువాత అఖిల్ ఖాతాలో పెద్ద హిట్టు పడలేదు. చివరికిగా ఆయన నటించిన ‘ఏజెంట్’ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ప్రస్తుతం మరో సినిమాతో వస్తున్నట్లు సమాచారం. ఇక అఖిల్ చిన్నప్పటి నుంచి తండ్రి నాగార్జునతో కలిసి సినిమా షూటింగ్ ప్రదేశాలకు వెళ్లేవారు. ఈ సందర్భంగా సినీ హీరోలను కలుస్తూ ఉండేవారు.

    జూనియర్ ఎన్టీఆర్ సాంబ సినిమా తీస్తున్న సమయంలో అ ప్రదేశానికి అఖిల్ వచ్చాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అఖిల్ ఫొటోకు ఫోజులిచ్చాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అఖిల్ కు మంచి హిట్టు రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ ఫొటోలో జూనియర్ ఎన్టీఆర్ కాస్త బొద్దుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో బిజీగా మారాడు.