NTR Vs Balakrishna: బాబాయ్ వర్సెస్ అబ్బాయ్… నందమూరి అభిమానుల మధ్య చిచ్చు?

ఎన్టీఆర్ ని టార్గెట్ చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆయన జోలికి వస్తే బాగోదని హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో ఆయన్ని ఆ పార్టీకి శాశ్వతంగా దూరం చేయాలని చంద్రబాబు నాయుడు స్వయంగా ఇలా చేస్తున్నారనే వాదన ఉంది.

Written By: NARESH, Updated On : November 10, 2023 9:46 am

NTR Vs Balakrishna

Follow us on

NTR Vs Balakrishna: ఎన్టీఆర్, బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్దే పోటీపడే సూచనలు కలవంటూ టాలీవుడ్ లో ఓ ప్రచారం నెలకొంది. మరి అదే జరిగితే నందమూరి అభిమానులు మధ్య చిచ్చు పెట్టినట్లే. నందమూరి అభిమానులు రాజకీయాల కారణంగా రెండుగా విడిపోయిన విషయం తెలిసిందే. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ ని నందమూరి అభిమానుల్లోని ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు.

ఈ విషయాన్ని టీడీపీ వర్గాలు హైలెట్ చేశాయి. ఆయన పేరు పెట్టుకుని ఎదిగిన ఎన్టీఆర్ కి కనీస కృతజ్ఞత లేదని విమర్శలు చేశారు. కొందరు టీడీపీ నాయకులు ఎన్టీఆర్ మీద విమర్శలు గుప్పించారు. కాగా నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మౌనం వహించడం మరింత వివాదం రేపింది. ఎన్టీఆర్ పై టీడీపీ వర్గాలు, బాలయ్య ఫ్యాన్స్ దారుణమైన కామెంట్స్ చేశారు. టీడీపీ అనుకూల మీడియాలో డిబేట్లు పెట్టి ఎన్టీఆర్ ని ఏకిపారేశారు.

ఎన్టీఆర్ ని టార్గెట్ చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆయన జోలికి వస్తే బాగోదని హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో ఆయన్ని ఆ పార్టీకి శాశ్వతంగా దూరం చేయాలని చంద్రబాబు నాయుడు స్వయంగా ఇలా చేస్తున్నారనే వాదన ఉంది. కాగా నందమూరి అభిమానుల్లో చీలిక వచ్చిందనేది నిజం. భగవంత్ కేసరి థియేటర్స్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ బ్యానర్స్ ని బాలయ్య అభిమానులు తొలగించారు.

ఇలాంటి పరిస్థితుల మధ్య దేవర, NBK 109 బాక్సాఫీస్ వద్ద పోటీపడే అవకాశం కలదంటున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న NBK 109 షూటింగ్ ఇటీవల మొదలైంది. బాబీ-బాలయ్య చిత్రం ఒకటి రెండు వారాల వ్యవధిలో లేదా ఏప్రిల్ మొదటివారంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ అట. ఇదే జరిగితే నందమూరి అభిమానుల మధ్య కోల్డ్ వార్ తప్పదంటున్నారు.