https://oktelugu.com/

థియేటర్లు ఓపెన్ అయినా కన్పించని సందడి..ఇప్పుడేలా? 

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతోనే కేంద్రం లాక్డౌన్ విధించింది. ఆ తర్వాత క్రమంగా ఆన్ లాక్ చేస్తూ సాధారణ పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే లాక్డౌన్.. కరోనా వల్ల సినిమా రంగం పూర్తిగా కుదేలైపోయింది. ప్రధానంగా థియేటర్ల రంగంపై కోలుకోలేని దెబ్బ తగిలిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Also Read: రియల్ హీరో సోనుసూద్ సాయం వెనుక ఉందెవరు? ఆన్ లాక్ లో భాగంగా అక్టోబర్ 15నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం మార్గదర్శకాలను విడుదల […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2020 / 02:12 PM IST
    Follow us on

    దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతోనే కేంద్రం లాక్డౌన్ విధించింది. ఆ తర్వాత క్రమంగా ఆన్ లాక్ చేస్తూ సాధారణ పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే లాక్డౌన్.. కరోనా వల్ల సినిమా రంగం పూర్తిగా కుదేలైపోయింది. ప్రధానంగా థియేటర్ల రంగంపై కోలుకోలేని దెబ్బ తగిలిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: రియల్ హీరో సోనుసూద్ సాయం వెనుక ఉందెవరు?

    ఆన్ లాక్ లో భాగంగా అక్టోబర్ 15నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. 50శాతం అక్యుపెన్సీతో కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నిర్వహించుకోవాలని కేంద్రం మెలిక పెట్టడంతో టాకీసులు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కేవలం 5శాతం మాత్రమే థియేటర్లు ఓపెన్ అయినట్లు తెలుస్తోంది.

    Also Read: ‘బిగ్ బాస్’లో ఓవర్ ఎమోషన్.. ‘వంటలక్క’ను మించి..!

    కరోనా నిబంధనలు.. 50శాతం అక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేస్తే థియేటర్లపై మరింత నిర్వహణ భారం పడనుంది. ఈ కారణంగానే పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ కావడం లేదని తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెనింగ్ పై నిర్వాహకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయితే డిసెంబర్ నుంచి థియేటర్లను పునః ప్రారంభించేందుకు నిర్వాహకులు చర్చలు జరుపుతున్నారు.

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో తగ్గకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటు పడిపోతున్నారు. కరోనా సమయంలో రిస్కు చేసి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కరోనాకు త్వరగా వ్యాక్సిన్ వచ్చి మునపటి పరిస్థితులు వస్తే తప్పా థియేటర్లు మళ్లీ  ప్రేక్షకులతో కళకళలాడవనే టాక్ విన్పిస్తోంది. ఈనేపథ్యంలో వచ్చే సంక్రాంతి, సమ్మర్ కూడా పెద్దగా బిజినెస్ కాకపోవచ్చనే టాక్ సినీవర్గాల్లో వ్యక్తమవుతోంది.