NTR : గత ఏడాది విడుదలైన ‘సప్తసాగరాలు దాటి’ అనే చిత్రం విడుదలై అటు కన్నడ లోనూ, ఇటు తెలుగులోనూ ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా వచ్చింది, కానీ ఆ సీక్వెల్ అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ ని అందుకోలేకపోయింది. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన రుక్మిణీ వసంత్ మన తెలుగు ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. చూసేందుకు చాలా సంప్రదాయబద్ధంగా అనిపిస్తూనే, అప్పుడప్పుడు హాట్ లుక్స్ కుర్రాళ్ళ బుర్రలను హీట్ ఎక్కించేలా చేస్తుంది ఈ బ్యూటీ. ఈమెకి కన్నడ తో తెలుగు, తమిళ భాషల్లో కూడా అవకాశాలు క్యూలు కడుతున్నాయి.అలా వరుసగా ఆమె ఆరు సినిమాల్లో హీరోయిన్ గా నటించేందుకు సంతకాలు చేసింది. వాటిలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ, కాంతారా 2 మూవీ కూడా ఉంది. వీటితో పాటు ఆమె మరో నాలుగు చిన్న సినిమాలకు కూడా అడ్వాన్స్ తీసుకుంది.
అయితే ఇక్కడే ఆమెకి అసలు సమస్య వచ్చింది. అదేమిటంటే ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాకి అగ్రిమెంట్ మీద సైన్ చేసేటప్పుడు, మా సినిమా పూర్తి అయ్యే వరకు మరో సినిమా షూటింగ్ లో పాల్గొనరాదు అనే స్ట్రిక్ట్ రూల్ ఉందట. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘కాంతారా 2 ‘ చిత్రానికి కూడా డైరెక్టర్ రిషబ్ శెట్టి అదే రూల్ పెట్టాడు. ‘కాంతారా 2 ‘ చిత్రం త్వరలోనే పూర్తి అవ్వబోతుంది. వచ్చే నెల నుండి ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా మొదలు కాబోతుంది. ప్రశాంత్ నీల్ తన ప్రతీ సినిమాని చాలా నిదానంగా తీస్తాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ అమ్మాయి ఈ చిత్రం పూర్తి అయ్యే వరకు మరో ప్రాజెక్ట్ చేయకూడదు. ఇప్పుడు ఈమె సంతకాలు చేసిన నాలుగు చిన్న సినిమాల షూటింగ్స్ కూడా త్వరలోనే మొదలు కానున్నాయి.
ఇప్పుడు ఆ చిత్రాల దర్శక నిర్మాతలు ఈమె డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి వాళ్ళతో సినిమాలు చేయలేదు. అలా అని ఆ సినిమాలు వదులుకోవడానికి కూడా ఈమెకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ చిత్రాల నిర్మాతల నుండి ఈమె భారీ రేంజ్ లో అడ్వాన్స్ లు అందుకుంది. ఇప్పుడు ఆమె చెయ్యను అంటూ ఆ అడ్వాన్స్ డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేయాలి. మరి ఈమె ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. కేవలం ఈ ఒక్క హీరోయిన్ విషయం లోనే కాదు, ఈమధ్య కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అయినా ప్రతీ కుర్ర హీరోయిన్ చేస్తున్న పొరపాట్లు ఇవే. సరైన ప్లానింగ్ లోపం వల్ల బోలెడంత నష్టపోతున్నారు. అయితే దర్శక నిర్మాతలు కూడా తమ సినిమా పూర్తి అయ్యే వరకు మరో సినిమా చేయకూడదు అనే రూల్ పెట్టడం ముమ్మాటికీ తప్పే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.