Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న విడుదల చేయగా దానికి అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్ బుకింగ్స్ కూడా ఊపందుకుంది, ఈ ఆదివారం నుండి తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి. అంతా సజావుగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఈ సినిమాకి సరికొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రాన్ని తొలుత హిందీ, తెలుగు, తమిళం భాషల్లో మాత్రమే విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఈ విషయమై మొదటి నుండి కర్ణాటకులు ప్రేక్షకులు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. కన్నడ భాషలో సినిమాని విడుదల చేయకపోతే బ్యాన్ చేస్తాము అంటూ హెచ్చరికలు జారీ చేసారు. మొదట్లో దీనిని మూవీ టీం అంత సీరియస్ గా తీసుకోలేదు.
కానీ నేడు కొంతమంది కర్ణాటక ప్రేక్షకులు గేమ్ చేంజర్ విడుదల అవ్వబోతున్న థియేటర్స్ వద్దకు వెళ్లి, అక్కడ గోడకి అంటించిన పోస్టర్స్ పై గేమ్ చేంజర్ అనే టైటిల్ పై రంగులు స్ప్రే చేస్తూ నిరసన వ్యక్తం చేసారు. కన్నడ భాషలో సినిమాని విడుదల చేయకపోతే, తెలుగు లో కూడా విడుదల కానివ్వబోమని, సినిమాని అడ్డుకుంటాము అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ బెదిరింపులు నిర్మాత దిల్ రాజు వరకు చేరిందో ఏమో తెలియదు కానీ, కాసేపటి క్రితమే కన్నడ వెర్షన్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ తర్వాత కాసేపటికి మలయాళం వెర్షన్ కూడా వదిలారు. కేవలం ఆందోళనకారులను శాంతిపచేయడానికి ట్రైలర్ ని వదిలారా?, లేకపోతే నిజంగానే కన్నడ భాషలో విడుదల చేయబోతున్నారా అనేది చూడాలి. రెండు రోజుల క్రితం వచ్చిన వార్త ఏమిటంటే, కన్నడ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తామని, ఈ ఈవెంట్ కి కేజీఎఫ్ హీరో యాష్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.
సాధారణంగా కర్ణాటక లో కన్నడ భాషలో సినిమాలను చూసేవాళ్లకంటే, మన తెలుగు బాషలోనే సినిమాలు చూసే వాళ్ళు ఎక్కువ. కన్నడ లో కేవలం కన్నడ హీరోల సినిమాలను మాత్రమే చూస్తారు. మన తెలుగు హీరోల సినిమాలు అసలు చూడడం లేదు. బాహుబలి సిరీస్ మినహా, ఇప్పటి వరకు మన తెలుగు పాన్ ఇండియన్ చిత్రం కన్నడ భాషలో కనీసం 6 కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా రాబట్టలేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం మాత్రమే 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు కన్నడ వెర్షన్ లో రాబట్టింది. ఆ మాత్రం గ్రాస్ కూడా కన్నడ స్టార్ హీరో సుదీప్ ఆ చిత్రంలో ఉండడం వల్లే వచ్చింది. అందుకే కన్నడ భాషలో దబ్ చేసి అదనపు ఖర్చు వృధా అని ఫీల్ అవ్వడం వల్లే దిల్ రాజు మొదట కేవలం మూడు భాషల్లోనే విడుదల చేయాలని అనుకున్నట్టు తెలుస్తుంది.