Akkineni Nageswara Rao: ఇండస్ట్రీ కి రెండు కండ్లు అనే మాట మీద సీరియస్ అయిన ఏఎన్ఆర్… మ్యాటరేంటంటే..?

ప్రస్తుతం వీళ్ళిద్దరూ మన మధ్య లేకపోవడం అనేది కొంతవరకు బాధాకరమైన విషయమే అయినప్పటికీ వీళ్ళ లెగసిని మాత్రం కంటిన్యూ చేస్తూ వీళ్ల వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

Written By: Gopi, Updated On : February 28, 2024 5:50 pm

Akkineni Nageswara Rao

Follow us on

Akkineni Nageswara Rao: సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే పేర్లలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు పేర్లు మొదటి స్థానంలో ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇండస్ట్రీకి చేసిన సేవలను మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఇక ఒకానొక సమయంలో తమిళ్ ఇండస్ట్రీ నుంచి విపరీతమైన డామినేషన్ ను సైతం ఎదుర్కొంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉనికిని కాపాడుకుంటూ వచ్చిన ఈ ఇద్దరు లెజెండ్స్ ను ఇండస్ట్రీకి రెండు కండ్లు గా చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ప్రస్తుతం వీళ్ళిద్దరూ మన మధ్య లేకపోవడం అనేది కొంతవరకు బాధాకరమైన విషయమే అయినప్పటికీ వీళ్ళ లెగసిని మాత్రం కంటిన్యూ చేస్తూ వీళ్ల వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే నాగేశ్వర రావు బతికున్నప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ మాటలు ఏంటి అంటే ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఇద్దరూ సినిమా ఇండస్ట్రీకి రెండు కండ్లు గా చెప్పుకుంటారు అనే మాటమీద నాగేశ్వరరావు కొంతవరకు కోపానికి వస్తూ ఇలా ఎవరన్నారో తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీకి మేము సేవలు అందించాం, మాతో పాటు కృష్ణ, శోభన్ బాబు, రేలంగి, ఎస్వీ రంగారావు, పద్మనాభం లాంటి గొప్ప నటులు కూడా తెలుగులో మంచి సినిమాలు చేస్తూ వాళ్లు కూడా వాళ్ల సేవలను అందించారు.

వాళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలో భాగమే అలాంటిది వాళ్లందరిని వదిలేసి ఎన్టీఆర్ ని నన్ను రెండు కండ్లు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఎన్టీఆర్ ముందు ఈ టాపిక్ తెచ్చిన ఆయన కూడా ఈ విషయాన్ని చాలా వరకు ఖండిస్తాడు. అంటూ ఆయన మిగితా ఆర్టిస్టుల ప్రాముఖ్యతను కూడా గుర్తు చేస్తూ మాట్లాడిన మాటలు నిజంగా ఆయన పెద్దరికానికి తార్కాణం గా మనం చెప్పుకోవచ్చు.

ఇక మొత్తానికైతే నాగేశ్వరరావు ఈ విషయం మద కొంతవరకు కోపంగానే మాట్లాడారు. నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా చాలా మంది తెలుగు సినిమా అభివృద్ధి కోసం పాటుపడినప్పటికీ వీళ్ళిద్దరు మాత్రం అందరి కంటే ముందే ధైర్యంగా నిలబడ్డారు. కాబట్టి వీళ్లను ఇండస్ట్రీకి రెండు కండ్లు గా చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదని సినిమా అభిమానులు సైతం ముక్త కంఠం తో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…