Chiranjeevi Watch: స్టార్ హీరోలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు వారికి సంబంధించిన ప్రతి విషయం గమనిస్తారు. వారి హావభావాలు అనుకరిస్తారు. వారు ధరించే బట్టలు, యాక్సెసరీస్ గురించి తెలుసుకుంటారు. అభిమానులు తమ హీరోలను ఫాలో అవుతుంటారు. కాగా అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన చిరంజీవి దశాబ్దాలుగా పరిశ్రమను ఏలుతున్నారు. యంగ్ స్టార్స్ కి పోటీ ఇస్తూ సత్తా చాటుతున్నారు. ఇటీవల చిరంజీవి ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ క్రమంలో ఆయన ధరించిన వాచ్ అభిమానులను ఆకర్షించింది. వెంటనే దాని గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆ వాచ్ బ్రాండ్ నేమ్, ధరను తెలుసుకున్నారు. ఆ రిస్ట్ వాచ్ ధర తెలిశాక ఆశ్చర్యపోవడం అందరి వంతు అయ్యింది. చిరంజీవి ధరించిన ఆ వాచ్ చూడటానికి చాలా సింపుల్ గా ఉంది. కానీ అది బ్రిటన్ కి చెందిన ఏ.లాంజ్ అండ్ స్నోహ్నే అనే కంపెనీకి చెందినది. దాని విలువ అక్షరాలా రూ. 50, 56, 747. ఒక వాచ్ ధర యాభై లక్షలు అంటే సామాన్యమైన విషయం కాదు.
ఓ మధ్యతరగతి కుటుంబం జీవితాంతం హాయిగా ఆ డబ్బుతో బ్రతికేయ వచ్చన్నమాట. చిరంజీవి, రామ్ చరణ్ వద్ద అత్యంత ఖరీదైన కార్ల కలెక్షన్ ఉంది. రోల్స్ రాయిస్ కారును వాడుతున్న అతికొద్ది మంది ప్రముఖుల్లో చిరంజీవి ఒకరు. మరోవైపు చిరంజీవి అలుపెరగకుండా సినిమాలు చేస్తున్నారు. 2022-23 లో చిరంజీవి ఏకంగా నాలుగు సినిమాలు విడుదల చేశాడు. వాటిలో వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కొట్టింది. రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. ఇది సోషియో ఫాంటసీ సబ్జెక్టు తో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. ఈషా చావ్లా, సురభి సైతం నటిస్తున్నారు. అలాగే చిరంజీవికి ఓ బడా నిర్మాణ సంస్థ వంద కోట్లు ఆఫర్ చేసిందట. పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తుండగా చిరంజీవి పచ్చజెండా ఊపారట. త్వరలో క్రేజీ ప్రకటన వచ్చే అవకాశం కలదంటున్నారు.