Homeఎంటర్టైన్మెంట్The Woman in the Yard : ఈ సినిమా చూడాలంటే మీకు కొండంత గుండె...

The Woman in the Yard : ఈ సినిమా చూడాలంటే మీకు కొండంత గుండె కావాలి… థియేటర్స్ లోకి వస్తున్న బెస్ట్ హారర్ థ్రిల్లర్! డిటైల్స్

The Woman in the Yard : హాలీవుడ్ లో బెస్ట్ హారర్ థ్రిల్లర్స్ తెరకెక్కుతాయి. తాజాగా మరో స్పైన్ చిల్లింగ్ మూవీ థియేటర్స్ లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అదే ది ఉమన్ ఇన్ ది యార్డ్. ఈ హారర్ థ్రిల్లర్ మార్చి 28న థియేటర్స్ లోకి రానుంది. ది ఉమన్ ఇన్ ది యార్డ్ ట్రైలర్ విడుదల కాగా.. అంచనాలు పెరిగిపోయాయి. జామే కొల్లెట్ సెర్రా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ స్పానిష్ అమెరికన్ దర్శకుడు ట్రైలర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

డానియెల్లే డెడ్విలర్, ఆక్యువ్ అక్పోక్వసిల్లి, రస్సెల్ హార్న్బై, పీటన్ జాక్సన్ ప్రధాన పాత్రలు చేశారు. ది ఉమన్ ఇన్ ది యార్డ్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. కెమెరా వర్క్ మెస్మరైజ్ చేస్తుంది. బీజీఎమ్ సైతం క్వాలిటీగా ఉంది. కొన్ని సన్నివేశాలు గగుర్గొలిపేలా ఉన్నాయి. సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ మనం చూడొచ్చు.

Also Read : వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఈమెనే.. సర్జరీ కోసం ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ది ఉమన్ ఇన్ ది యార్డ్ మూవీ కథ విషయానికి వస్తే.. పట్టణానికి దూరంగా గోధుమ పంట పొలాల మధ్య ఒక్క కుటుంబం నివాసం ఉంటుంది. వారు వ్యవసాయం చేస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలతో సహా మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారు. తండ్రి ఇంట్లో లేని సమయంలో పొలంలో ఒక మహిళ నల్లని వస్త్రాలు ధరించి, ముఖం కూడా కనిపించకుండా ఒక చైర్ లో కూర్చుని ఉంటుంది.

ఎవరో స్త్రీ మన ఇంటి ఎదుట పొలంలో ఒంటరిగా కూర్చుని ఉందని పిల్లలు తల్లికి చెబుతారు. కాలికి గాయం కావడం వలన కర్రల సహాయంతో నడుస్తున్న తల్లి.. ఆ మహిళను పలకరిస్తుంది. నీకేమైనా సహాయం కావాలా అని దూరం నుండి అడుగుతుంది? ఆమె స్పందించకపోవడంతో కాసేపట్లో నా భర్త వస్తాడని బెదిరిస్తోంది. నీ భర్తకు ప్రమాదం జరిగింది. నీ పిల్లల్ని తినేస్తా అని.. ఆ మహిళ తన నిజస్వరూపం బయటపెడుతోంది. ఆమె ఓ రాక్షసి అని తెలుసుకున్న మహిళ పిల్లలను ఆమె నుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ మహిళ తన ఇద్దరు పిల్లల్ని ఆ రాక్షసి నుండి కాపాడుకుందా లేదా? అనేది అసలు కథ..

The Woman In The Yard | Official Trailer 2

Exit mobile version