Most Beautiful Woman : అమ్మాయిలు అందానికి (Beauty) ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందరిలో తామే అందంగా కనిపించాలని రకరకాల ప్రొడక్ట్స్ అన్ని వాడుతుంటారు. ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే అందంగా కనిపించాలని సర్జరీలు (Surgery) చేయించుకుంటున్నారు. ఇలా చేసుకునే క్రమంలో కొందరు అందంగా (Beauty) కనిపిస్తే.. మరికొందరు అంద విహీనంగా తయారు అవుతారు. అయితే సెలబ్రిటీలు ఎక్కువగా అందంగా కనిపించాలని ఇలాంటి సర్జరీలు (Surgery) చేయించుకుంటారు. వీటికి లక్షలు, కోట్లు పెట్టి మరి అందంగా తయారు అవుతారు. ఇలా సర్జరీ చేసుకుని తన రూపాన్ని అందంగా ఓ మహిళ మార్చుకుని వరల్డ్ మోస్ట్ బ్యూటిపుల్ ఉమెన్‌గా (Most Beautiful Women) నిలిచింది. వినడానికి కాస్త షాకింగ్ అనిపించినా కూడా.. మీరు విన్నది నిజమే. కొన్ని కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి మరి ప్రపంచంలోనే అందమైన మహిళగా మారింది. అయితే ఇంతకీ ఎవరు ఆ మహిళ? అసలు ఎందుకు కోట్లు ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకుందో ఈ స్టోరీలో చూద్దాం.
బ్రెజిల్‌లోని సావోపోకి చెందిన జనైనా ప్రజెరెస్ (Janaina Prazeres) అనే 35 ఏళ్ల మహిళ రూ.8 కోట్లు ఖర్చు పెట్టి అందంగా మారింది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకుని.. ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచం ఆమెను ఆకర్షించేందుకే ఇన్ని కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అందంగా మారడానికి ఆమెకు మొత్తం 13 సర్జరీలు చేశారు. మూడు ముక్కు జాబ్‌లు, నాలుగు లైపోసక్షన్‌లు, బట్ ఫిల్లర్లు, మూడు బ్రెస్ట్ సర్జరీలు, ఫేస్‌లిఫ్ట్‌తో పాటు పలు శస్త్రచికిత్సలు, ఆపరేషన్‌లు కూడా చేయగా అందంగా మారింది. సహజ అందం కాదని, కేవలం పెట్టుబడి పెట్టడం వల్ల ఈ అందం వచ్చిందని ఆమె తెలిపింది. ఈ అందం తనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని జనైనా వెల్లడించింది.
అందానికి కూడా ఓ ధర ఉంటుందని, దాన్ని ఆమె వినియోగించినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి బొటాక్స్, లిప్ ఫిల్లర్స్ వస్తాయని జనైనా చెబుతోంది. అయితే ఆమె చేసిన పనికి చాలా మంది విమర్శించారు. దీంతో ఏం చేసినా జనాలు విమర్శిస్తారని ఆమె అంటోంది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి.. ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా పిలిపించుకోవడం చాలా గర్వంగా ఉందని తెలిపింది. అయితే సమాజం మహిళల అందాన్ని మాత్రమే గుర్తిస్తుంది. కానీ టాలెంట్‌ను గుర్తించదని వెల్లడించింది. మహిళలకు అందంతో పాటు ప్రతిభ, సామర్థ్యాలకు తగిన గుర్తింపు రావాలంది. తనకి అందానికే గుర్తింపు వచ్చిందని, కానీ టాలెంట్‌కి గుర్తింపు రాలేదని ఆమె తెలిపింది.