Nara Lokesh on Head Master : ఆ స్కూల్లో పిల్లలు ఉపాధ్యాయులు( teachers) చెప్పిన విధంగా చదువుకోవడం లేదు. దీంతో ఆ విద్యార్థులను దండించకుండా.. వినూత్న రీతిలో తనకు తానే దండన విధించుకొని వారిలో మార్పు తేవాలని భావించారు. ఏకంగా విద్యార్థుల ముందు గుంజీలు తీశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. విద్యార్థులను దండించకుండా అర్థం చేసుకునేలా స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన బాగుందంటూ హెచ్ఎం ను అభినందించారు. విజయనగరం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన ఇది.
Also Read : ఆమె కోసం కుటుంబమంతా కిడ్నీ దానం.. అరుదైన ఘటన.. ఎక్కడంటే?
* పాఠశాల ప్రార్థన సమయంలో..
విజయనగరం జిల్లా( Vijayanagaram district) బొబ్బిలి మండలం పెంట జడ్పి ఉన్నత పాఠశాల హెచ్ఎం చింత రమణ గుంజీలు తీసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. గురువారం విద్యార్థులు స్కూలుకు రాగానే ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. అయితే అక్కడికి వచ్చిన హెడ్మాస్టర్ విద్యార్థులతో మాట్లాడారు. పాము విద్యార్థులను కొట్టలేమని, తిట్టలేమని, ఏం చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ముందు చేతకాని వారిలా చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. తప్పు ఎవరిది విద్యార్థులదా? లేకుంటే ఉపాధ్యాయులుదా? అంటూ దండం పెట్టి అందరి ముందు సాష్టాంగ పడ్డారు. ఆ తరువాత గుంజీలు కూడా తీశారు. తమకు చేతనైన వరకు ప్రయత్నాలు చేస్తున్నామని.. పిల్లలను కంట్రోల్ చేయలేక పోతే స్కూల్ కు పంపించడం వృధా అన్నారు.
* తిరిగి ఫిర్యాదులు రావడంతోనే..
పాఠశాలల్లో చదువుల( education) విషయంలో ఉపాధ్యాయులు దండనకు దిగితే తిరిగి వారి పైనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పాఠశాలలో ఇదే మాదిరిగా ఫిర్యాదులు రావడంతో ఏం చేయలేక హెచ్ ఎం రమణ అలా బహిరంగ క్షమాపణలు కోరాల్సి వచ్చింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి లోకేష్ స్పందించారు.’ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగానే ఉందని, చెప్పిన మాట వినడం లేదని.. విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్మాస్టర్ గారు.. అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ చర్యల ఆలోచన బాగుంది. అభినందనలు. అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం ‘ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతున్నాయి.
విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని….విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్మాస్టరు గారూ!… pic.twitter.com/Se7zu6uwf5
— Lokesh Nara (@naralokesh) March 13, 2025