‘ఆర్ఆర్ఆర్’కు మరోసారి థర్డ్ వేవ్ అడ్డుపడుతోందా..?

టాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి సినిమా రావాలంటే కనీసం మూడు సంవత్సరాలు ఆగాలి. అయినా చాలా మంది అభిమానులు ఆయన సినిమా తొందరగా రావాలని వేడుకుంటారు. అయితే ఈసారి జక్కన్న సినిమాకు కరోనా వైరస్ మరో రెండు సంవత్సరాలు ఎక్చ్టేండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు సినిమా పూర్తయ్యే సమయానికి ‘ఆర్ఆర్ఆర్’కు కరోనా వైరస్ అడ్డు పడడంతో ఆ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఎన్నో ఇబ్బందుల మధ్య ఈనెలలో షూటింగ్ పున: ప్రారంభించనున్నారు. అయితే ఈసారి కరోనా […]

Written By: NARESH, Updated On : July 4, 2021 3:00 pm
Follow us on

టాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి సినిమా రావాలంటే కనీసం మూడు సంవత్సరాలు ఆగాలి. అయినా చాలా మంది అభిమానులు ఆయన సినిమా తొందరగా రావాలని వేడుకుంటారు. అయితే ఈసారి జక్కన్న సినిమాకు కరోనా వైరస్ మరో రెండు సంవత్సరాలు ఎక్చ్టేండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు సినిమా పూర్తయ్యే సమయానికి ‘ఆర్ఆర్ఆర్’కు కరోనా వైరస్ అడ్డు పడడంతో ఆ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఎన్నో ఇబ్బందుల మధ్య ఈనెలలో షూటింగ్ పున: ప్రారంభించనున్నారు. అయితే ఈసారి కరోనా థర్డ్ వేవ్ అడ్డు తగిలే అవకాశం ఉందా..?

రామ్ చరన్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ పై రాజమౌళి భారీ ఆశలు పెట్టుకున్నారు. బాహుబలి సినిమాల కంటే ఎక్కవై ఎక్విప్ మెంట్ తో సినిమా తీస్తున్నారు. ఇప్పటికే సినిమాపై హైప్ క్రియేట్ చేయడంతో అభిమానులు అంతే స్థాయిలో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అన్నీ సక్రమంగా సాగితే ఈ ఏడాది ప్రారంభంలోనే సినిమా థియేటర్లోకి వచ్చేది. కానీ కరోనా సెకండ్ వేవ్ షూటింగ్ కు అడ్డు తగిలింది.

ఈసారి ఎలాగైనా షూటింగ్ పూర్తి చేసి థియేటర్లోకి తీసుకురావాలని చిత్రం యూనిట్ నిర్ణయించుకుందట. అక్టోబర్ వరకు ఎలాగైనా షూటింగ్ పూర్తి చేసి థియేర్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే కరోనా థర్డ్ వేవ్ అక్టోబర్ లో ఉంటుందని అంటున్నారు. మరోసారి ఆర్ఆర్ఆర్ కు అడ్డుపడే ప్రమాదం ఉందా..? అని చర్చించుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే రిపబ్లిక్ డే వరకైనా సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

ఈ సినిమా పోస్టర్లు, ప్రోమోలతో ఇప్పటికే సందడి చేస్తోంది. మరోవైపు మెగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ నెలలో స్ట్రాట్ అయ్యే షూటింగ్లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవ్ గన్ లు పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.