https://oktelugu.com/

మోహరిన్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కు కారణం ఇదే..

కొంతమంది సినిమా హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తరువాత ఆ లైఫ్లో ఇమడలేకపోతారు. ఇంకొందరు మాత్రం సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నిశ్చితార్థం వరకు వెళ్లిన పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకుంటారు. తాజాగా హీరోయిన్ మోహరిన్ కూడా అదే పని చేసింది. తనకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ మ్యారేజ్ లైఫ్ పై లేకపోవడంతో ఆమె తన ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ టాపిక్ సంబంధించిన వివరాలు.. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’, ‘మహానుభావుడు’, ‘ఎఫ్-2’ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 4, 2021 / 03:17 PM IST
    Follow us on

    కొంతమంది సినిమా హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తరువాత ఆ లైఫ్లో ఇమడలేకపోతారు. ఇంకొందరు మాత్రం సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నిశ్చితార్థం వరకు వెళ్లిన పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకుంటారు. తాజాగా హీరోయిన్ మోహరిన్ కూడా అదే పని చేసింది. తనకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ మ్యారేజ్ లైఫ్ పై లేకపోవడంతో ఆమె తన ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ టాపిక్ సంబంధించిన వివరాలు..

    ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’, ‘మహానుభావుడు’, ‘ఎఫ్-2’ సినిమాల్లో అలరించిన మోహరిన్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లో నటిస్తుండగానే ఒక్కసారిగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. అయితే ఆమె పెళ్లి చేసుకునేది మాజీ ముఖ్యమంత్రి కుమారుడు భవ్య బిష్ణోయ్ ని. సాధారణంగా సినిమాల నుంచి వచ్చిన వాళ్లను పొలిటికల్ వాళ్లు పెళ్లి చేసుకోవడం కామన్. అయితే పెళ్లయిన తరువాత వారు సినిమాల్లో నటించడానికి అంగీకరించరు.

    అయితే ఈ విషయంపై క్లారిటీలేని మోహరిన్ ఎంగేజ్ మెంట్ కు ఒప్పుకుంది. మరోవైపు కొన్ని సినిమాలు చేయడానికి రెడీ అయింది. దీంతో ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో వీరు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మోహరిన్ మాత్రమే తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కానీ భవ్య భిష్ణోయ్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

    ఏదీ ఏమైనా నిన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇక మోహరిన్ టాపిక్ , మరొకటి అమిర్ ఖాన్ విషయం హాట్ హాట్ గా చర్చ సాగింది. ఇద్దరు ప్రముఖులు తమ పెళ్లి, నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడం సంచలనలంగా మారింది. అయితే మోహరిన్ ‘ఎఫ్-2’ సీక్వెల్ లో నటిస్తోంది.