https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘ఓజీ’ క్లాన్ మొత్తానికి దడపుట్టించిన టేస్టీ తేజా..అదేమీ బుర్ర బాబోయ్..హిస్టరీ లో ఇలాంటి కంటెస్టెంట్ లేడు!

ఓజీ క్లాన్ కూడా టేస్టీ తేజా ని కావాలని టార్గెట్ చేయలేదు. హరి తేజ చాలా పక్షపాతం చూపిస్తూ కేవలం తన రాయల్ క్లాన్ సబ్యులని నామినేషన్స్ నుండి తప్పించి, ఓజీ క్లాన్ వాళ్ళను నామినేట్ చేస్తుంది. ఇది బాగా గమనించిన నిఖిల్, హరితేజ ఆటలను అరికట్టేందుకు తేజా దగ్గర బలమైన పాయింట్స్ ఉండడంతో అతన్నే నామినేట్ చేయాలని గ్రూప్ గా అనుకుంటారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 16, 2024 / 08:37 AM IST

    Bigg Boss Telugu 8(117)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన సీజన్ 7 కంటెస్టెంట్ టేస్టీ తేజా ఎక్కువగా తోటి హౌస్ మేట్స్ తో ఫన్ చేస్తాడు కాబట్టి, అతన్ని అందరూ తేలికగా తీసుకోవచ్చు కానీ, ఇతనికి ఉన్న తెలివితేటలు బిగ్ బాస్ హిస్టరీ లోనే ఇప్పటి వరకు మరో కంటెస్టెంట్ లో చూడలేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. నిన్న, మొన్న జరిగిన నామినేషన్స్ లో ఓజీ క్లాన్ సభ్యులు టేస్టీ తేజాని ఏకంగా ఆరు సార్లు నామినేట్ చేయాలని అనుకున్నారు. కానీ 5 సార్లు తేజా తనని తాను సరైన పాయింట్స్ తో డిఫెండ్ చేసుకొని, నామినేషన్స్ లోకి రాకుండా ఉండేందుకు అతను చేసిన ప్రయత్నం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయక తప్పదు. అంతే కాదు, అతని పాయింట్స్ కి కిల్లర్ గర్ల్స్ కూడా అతన్ని నామినేషన్ లో పెట్టలేకపోయారు అంటేనే అర్థం చేసుకోవచ్చు, తేజ ఏ రేంజ్ లో డిఫెండ్ చేసుకున్నాడు అనేది.

    అయితే ఓజీ క్లాన్ కూడా టేస్టీ తేజా ని కావాలని టార్గెట్ చేయలేదు. హరి తేజ చాలా పక్షపాతం చూపిస్తూ కేవలం తన రాయల్ క్లాన్ సబ్యులని నామినేషన్స్ నుండి తప్పించి, ఓజీ క్లాన్ వాళ్ళను నామినేట్ చేస్తుంది. ఇది బాగా గమనించిన నిఖిల్, హరితేజ ఆటలను అరికట్టేందుకు తేజా దగ్గర బలమైన పాయింట్స్ ఉండడంతో అతన్నే నామినేట్ చేయాలని గ్రూప్ గా అనుకుంటారు. టేస్టీ తేజా ఇక్కడ కూడా ఎంత మాస్టర్ మైండ్ అనేది గమనించండి. వీళ్లంతా గ్రూప్ గా మాట్లాడుకొని, నన్ను బయటకి పంపాలనే ప్లాన్ తోనే వచ్చి నామినేట్ చేసారు. అది బాగా అర్థం అవుతుంది, సరే మీ ఆట మీరు ఆడండి, నా ఆట నేను ఆడుతాను అని అంటాడు. ఇక్కడ నిఖిల్ ఒక్కసారిగా షాక్ కి గురి అవుతాడు. ఆరవసారి కూడా టేస్టీ తేజ నామినేషన్ లోకి వచ్చేవాడు కాదు. కానీ హరితేజ పక్షపాత బుద్ధి చూపడం వల్లే తేజా నామినేషన్స్ లోకి వచ్చాడు. ఎలా జరిగిందంటే నిఖిల్, విష్ణు ప్రియా నామినేషన్స్ వేయడానికి వస్తారు, నిఖిల్ తేజా ని నామినేట్ చేయాలని అంటాడు, విష్ణు ప్రియా నయనీ పావని పేరు చెప్తుంది.

    కారణం నయనీ పావని హోటల్ టాస్క్ లో తేజా కంటే బాగా ఆడినట్టు ఆమెకి కనిపించిందట. జనాలెవ్వరికీ కనిపించనిది ఈమెకు ఎలా కనపడిందో అర్థం కాలేదు. హోటల్ టాస్క్ లో నయనీ పావని ఆడిందేమి లేదు, ఆమెకంటే టేస్టీ తేజా తనకి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేసాడు. ఇది హరితేజ కి కనిపించలేదు. టేస్టీ తేజ కంటే ఆమెకు నయనీ పావని అంటే ఇష్టం, అందుకే తేజా ని బలిపశువుని చేసింది. ఇక తేజా కూడా తనని తాను డిఫెండ్ చేసుకొని అలిసిపోయి వెళ్లి నామినేషన్ వేసుకోపో అని హరితేజ కి చెప్తాడు. అయితే నిన్న మొన్నటి వరకు తేజ గ్రాఫ్ డేంజర్ జోన్ లో ఉన్నింది, కానీ నిన్నటి ఎపిసోడ్ తో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ వారం గౌతమ్ ఎలిమినట్ అయ్యే అవకాశాలు ఎక్కువ.