Bigg Boss Telugu 8: ‘నీ భార్యని పంపించు’ అంటూ అవినాష్ ని నోరు మూసుకునేలా చేసిన పృథ్వీ..ఒకే దెబ్బకు రెండు పిట్టలు!

నిన్న నామినేషన్స్ లో పృథ్వీ కి అవినాష్ అడ్డంగా దొరికిపోయాడు అనే చెప్పాలి. హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండే అవినాష్ పృథ్వీ ని టార్గెట్ చేసినట్టుగా అందరికీ అనిపించింది. హౌస్ లో నువ్వు రెండు మూడు టాస్కులు తప్ప ఏది ఆడినట్టు నాకు అనిపించలేదు అని చెప్పి పృథ్వీ ని గత వారం నామినేట్ చేస్తాడు అవినాష్.

Written By: Vicky, Updated On : October 16, 2024 8:46 am

Bigg Boss Telugu 8(118)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన సీజన్ 4 కంటెస్టెంట్ అవినాష్ లో ఆడియన్స్ ఈమధ్య కొత్త రకమైన షేడ్స్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ లో అవినాష్ చేసే కామెడీ మామూలుది కాదు. ప్రతి కామెంట్ ని ఆయన స్పోర్టివ్ గా తీసుకునే వాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత అవినాష్ ప్రతీ దానికి కోపం తెచ్చుకొని, పెద్ద రచ్చ చేస్తున్నాడు. నిన్న నామినేషన్స్ లో పృథ్వీ కి అవినాష్ అడ్డంగా దొరికిపోయాడు అనే చెప్పాలి. హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండే అవినాష్ పృథ్వీ ని టార్గెట్ చేసినట్టుగా అందరికీ అనిపించింది. హౌస్ లో నువ్వు రెండు మూడు టాస్కులు తప్ప ఏది ఆడినట్టు నాకు అనిపించలేదు అని చెప్పి పృథ్వీ ని గత వారం నామినేట్ చేస్తాడు అవినాష్. దీనికి పృథ్వీ ఈ వారం అవినాష్ పై నామినేషన్ వేస్తూ ‘నేను టాస్కులు ఎలా ఆడుతానో, నా వరకు వస్తే ఎంత బెస్ట్ ఇవ్వగలనో అనేది హౌస్ లో ఉన్న వాళ్లందరికీ తెలుసు.

కానీ మీరు నేను రెండు టాస్కులు తప్ప ఏమి ఆడలేదని అంటున్నారు. నాకు తెలిసి మీరు కేవలం ప్రోమోలు చూసి వచ్చి నాపై నామినేషన్స్ వేశారు, ఫుల్ ఎపిసోడ్స్ చూడలేదు, మీరు చెప్పిన పాయింట్స్ నాకు నచ్చలేదు, అందుకే మిమ్మల్ని నేను నామినేట్ చేస్తున్నా’ అని అంటాడు. దీనికి అవినాష్ సమాధానం చెప్తూ ‘నేను షూటింగ్స్ లో బిజీ గా ఉండడం వల్ల, కేవలం రెండు మూడు ఎపిసోడ్స్ మాత్రమే చూసాను. నా భార్య అన్ని ఎపిసోడ్స్ ని చూసింది, ఆమె నీ గురించి చెప్పడం వల్లే నేను నిన్ను నామినేట్ చేశాను’ అని అంటాడు. దీనికి పృథ్వీ సమాధానం ఇస్తూ ‘అలాంటప్పుడు మీరెందుకు బిగ్ బాస్ కి వచ్చారు, మీ భార్యనే పంపాల్సింది’ అని అంటాడు. అప్పుడు అవినాష్ ‘భార్య పేరు తియ్యకు’ అని అరుస్తాడు. ‘నేనెక్కడ తీసాను..నువ్వే కదా చెప్పావు. ఎపిసోడ్స్ చూడకుండా, నీకంటూ ఒక అభిప్రాయం లేకుండా, మీ కుటుంబ సభ్యులు చెప్పిన పాయింట్స్ ని నువ్వెలా చెప్తావు?, అది కరెక్ట్ కాదు కదా, నువ్వు ఎపిసోడ్స్ మొత్తం చూసి, నీకంటూ ఒక అభిప్రాయం ఏర్పడిన తర్వాత నామినేషన్ వేసుంటే బాగుండేది’ అని అంటాడు పృథ్వీ.

చాలా బలమైన పాయింట్స్ తో అవినాష్ ని పృథ్వీ లాక్ చేయడం వల్ల, అవినాష్ డిఫెన్స్ లోకి పడుతాడు, ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాటా పెరుగుతుంది. అయితే హరితేజ పృథ్వీ చెప్పిన పాయింట్స్ కి ఏకీభవించి అవినాష్ ని నామినేషన్ లోకి వేయాలని అనుకుంటుంది. అప్పుడు అవినాష్ ‘సరే నేను ఎపిసోడ్స్ చూడలేదు. నువ్వు ఎపిసోడ్స్ మొత్తం చూసావు కదా, పృథ్వీ ఎన్ని టాస్కులు ఆడాడో చెప్పు’ అని అంటాడు. దానికి హరితేజ ‘అలా సడన్ గా ఎదిగితే ఎలా గుర్తుకు వస్తుంది’ అని అంటుంది. ‘నువ్వే నాతో చాలా సార్లు అన్నావు, నేను కేవలం కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే చూసాను అని..ఇప్పుడేమో ఎపిసోడ్స్ మొత్తం చూసా అని అంటున్నావు’ అని హరి తేజ ని లాక్ చేస్తాడు. అలా నామినేషన్స్ లోకి వచ్చిన అవినాష్ కి బిగ్ బాస్ ఇమ్మ్యూనిటి ని గుర్తు చేసి, ఎవరినో ఒకరిని ఈ పవర్ ఉపయోగించి నామినేషన్స్ నుండి సేవ్ చేసి, వేరే ఒక కంటెస్టెంట్ ని నామినేషన్ లోకి దించండి అని అంటాడు బిగ్ బాస్. అవినాష్ ఆ పవర్ ని తన కోసం ఉపయోగించుకొని నామినేషన్స్ నుండి సేవ్ అయ్యి, హరితేజ ని నామినేషన్స్ లోకి పంపుతాడు.