Spirit Movie Story: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు ‘ సందీప్ రెడ్డి వంగ’… ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ఆయన మార్క్ మాత్రం ప్రతి సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. అతన్ని చూసి చాలామంది దర్శకులుగా మారాలని అనుకుంటున్నారు అంటే ఆయన సినిమా ఇండస్ట్రీ మీద ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడో మా అర్థం చేసుకోవచ్చు… నిజానికి ఆయన సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పటికి ఆ సీన్ లోని ఇంటెన్స్ చెడిపోకుండా ప్రేక్షకుడికి కన్వే చేయడంలో ఆయన సక్సెస్ అవుతుంటారు. నిజానికి సందీప్ రెడ్డి వంగ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంటుంది. ఇప్పటికే బాలీవుడ్ ను సైతం షేక్ చేసిన ఆయన బాలీవుడ్ మాఫియా కి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూనే వస్తుంటాడు. ఇక ఇలాంటి సందీప్ రెడ్డివంగ ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా కోసం పూర్తి కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథతో తెరకెక్కుతోంది. మొదట ఈ సినిమా కోసం వేరే కథను అనుకున్నప్పటికి ప్రభాస్ కి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితేనే బాగుంటుందని సందీప్ ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాల క్రితం సందీప్ రెడ్డి వాళ్ల అన్నయ్య అయిన ప్రణయ్ రెడ్డి ఒక లైన్ చెప్పారట.
ఇక ఆ లైన్ తోనే స్పిరిట్ సినిమా కథని రాసుకున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి సందీప్ రెడ్డివంగా వాళ్ళ అన్నయ్యకు కూడా సినిమాలంటే చాలా పిచ్చి అందుకే వీళ్ళిద్దరు కలిసే అర్జున్ రెడ్డి సినిమా కోసం భద్రకాళి ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేసి దాని మీదే ఆ సినిమాని తెరకెక్కించారు.
మొత్తానికైతే 5 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి 50 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. అలాంటి ప్రణయ్ రెడ్డి ఇచ్చిన ఒక లైన్ తో ఇప్పుడు సందీప్ స్పిరిట్ కథ మొత్తాన్ని అల్లినట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే సందీప్ లైన్ కాకపోయిన కూడా దాన్ని ఓన్ చేసుకొని అద్భుతంగా కథని మలిచినట్టుగా తెలుస్తోంది. ఇక స్క్రీన్ మీద ప్రభాస్ ను ఎలా చూపిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇక వచ్చే నెల నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూట్ అయితే జరగబోతుందట… ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ ఈ నెలతో ఈ షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు…