Peddi Background Score: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా మీద ప్రేక్షకుల విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద రామ్ చరణ్ సైతం భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇక ఇప్పటివరకు షూట్ చేసిన ఎపిసోడ్స్ మొత్తం చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఒక సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. ‘చికిరి చికిరి’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న పాటలు అద్భుతంగా వస్తున్నాయట. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ వస్తోంది. మాస్ సినిమాలకు ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అంత ఎఫెక్టివ్ గా ఇవ్వలేడు అనేది గతంలో చాలాసార్లు ప్రూవ్ అయింది.
మరి ఈ సినిమాకి తన బ్యాగ్రౌండ్ స్కోర్ ఏ రకంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ కూడా బ్యా గ్రౌండ్ మ్యూజిక్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాయి. కారణం ఏంటి అంటే సీన్ లో ఉన్న డెప్త్ ఎలివేట్ అవ్వాలంటే బ్యా గ్రౌండ్ స్కోర్ ఎఫెక్టివ్ గా ఉన్నప్పుడే ఈ మూవీ చూస్తున్న ప్రేక్షకులు దానికి ఎక్కువగా కనెక్ట్ అవుతారు…
దానివల్ల సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతోంది. కాబట్టి ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఏఆర్ రెహమాన్ ఎలాంటి కేర్ తీసుకుంటున్నాడు. బిజిఎం అద్భుతంగా ఉన్నప్పుడే సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తోంది. ఏమాత్రం తగ్గినా కూడా ఈ సినిమాలో ఉన్న ఇంటెన్స్ చెడిపోయే అవకాశం ఉందని చాలామంది సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమా సాంగ్స్ విషయంలో కాదు బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో ఏఆర్ రెహమాన్ పెద్ద టాస్క్ ని ఎదుర్కోబోతున్నాడు అంటూ కొన్ని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి… చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తోంది. ఏ ఆర్ రెహమాన్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడా లేదా అనేది…