Vijay Deverakonda New Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ…పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి రెండు సినిమాలతో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు సక్సెసులు రావడం లేదు. కానీ ఒక్క సక్సెస్ పడితే ఆయన టైర్ వన్ హీరోగా మారిపోతాడు. రీసెంట్ గా వచ్చిన ‘కింగ్ డమ్’ సినిమా కూడా ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో ఆయన చాలావరకు డీలా పడిపోయాడు. ప్రస్తుతం ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా ఆయన తన మార్కెట్ ను కోల్పోవాల్సిన ప్రమాదం ఉంది. అందుకే సినిమాకి కమిట్ అయ్యేటపుడే డైరెక్టర్ మంచోడా కాదా అని చూసుకోకుండా కథ బాగుందా? లేదా అనేది చూసుకొని ముందుకు సాగితే మంచిదని పలువురు సినిమా మేధావులు సైతం విజయ్ దేవరకొండకు సలహాలైతే ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన రవికిరణ్ దర్శకత్వంలో ‘రౌడీ జనార్దన్’ అనే సినిమా చేస్తున్నాడు.
దీంతో పాటు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఒక సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలతో ఎలా సక్సెస్ ని సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇక వీటితోపాటు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమాలు ఎలాంటి విజయాలను సాధిస్తాయి.
విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారడానికి ఈ సినిమాలు ఎలా హెల్ప్ అవుతాయి అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న… ప్రస్తుతం నాని లాంటి స్టార్ హీరో మాస్ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతుంటే విజయ్ మాత్రం డిఫరెంట్ కథలను ఎంచుకొని సినిమాలుగా చేస్తున్నాడు.
ఇలాంటి క్రమంలో నాని ని బీట్ చేసి విజయ్ ముందుకు సాగాలంటే మాత్రం చాలా కసరతులు చేయాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం నాని టైర్ వన్ హీరోకి చాలా దగ్గరి పొజిషన్ లో ఉన్నాడు. ప్యారడైజ్ తో కనక భారీ సక్సెస్ ని సాధిస్తే ఆయన టైర్ వన్ హీరోగా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి…కాబట్టి విజయ్ కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధిస్తే తప్ప నాని ని మ్యాచ్ చేసే అవకాశమైతే లేదనే చెప్పాలి…