Coolie vs War 2 : సౌత్ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్ (Rajinikanth) కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన లోకేష్ కనకరాజు(Lokesh Kanaka Raj) డైరెక్షన్ చేస్తున్న కూలీ (Cooli) సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అందులో రజినీకాంత్ యొక్క స్టార్ డమ్ ను చూపిస్తూ ఆయన మేనరిజంని చాలా అద్భుతంగా ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా భారీ రేంజ్ లో తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది… లోకేష్ కనక రాజు లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం విశేషం… ఇప్పటివరకు ఆయన డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆయన చేసే ప్రతి సినిమాలో ఆ హీరో యొక్క వింటేజ్ లుక్స్ ని చూపిస్తూ వాళ్ళను స్టార్ హీరోలుగా మారుస్తూ తను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు వరుసగా ఏడు విజయాలను సాధించాడు. ఆయన ఎనిమిదో విజయం వైపు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ఐశ్వర్య రాయ్ తో నటించినందుకు రజినీకాంత్ ఇన్ని అవమానాలు ఎదురుకున్నాడా?
బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి వార్ 2 (War 2) సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాని సైతం ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి రజినీకాంత్ కూలీ సినిమా సక్సెస్ సాధిస్తుందా? లేదంటే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి చేస్తున్న వార్ 2 సినిమా సూపర్ సక్సెస్ ను అందుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఈ రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ అయితే నడుస్తుంది. ముఖ్యంగా సౌత్ లో కూలి సినిమా మీద ఎక్కువ అంచనాలు ఉంటే నార్త్ లో వార్ 2 సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలు నువ్వా నేనా అనే పోటీకి సిద్ధమవుతున్న వేళ ఎవరు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు.
తద్వారా ఎవరి స్టార్ డమ్ అనేది భారీ రేంజ్ లో పెరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఆగస్టు 14వ తేదీన సినిమాలు వస్తుండడం వల్ల ఆగస్టు 15 వ తేదీ కూడా ఈ సినిమాలకి బాగా కలిసి వస్తుంది. కాబట్టి మొదటి రెండు మూడు రోజుల్లో ఎవరు భారీ రికార్డులను కొల్లగొడుతూ ఓపెనింగ్స్ ని రాబడతారు అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read : నెల్సన్ vs లోకేష్ కనకరాజ్ ఈ ఇద్దరిలో ఎన్టీఆర్ తో సినిమా చేసేది ఎవరు..?