Allu Arjun Tattoo: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నింగ్ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప చిత్రానికి గానూ ఆయన నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకున్న ఫస్ట్ టాలీవుడ్ యాక్టర్ గా అల్లు అర్జున్ రికార్డులకు ఎక్కాడు. మూడు జనరేషన్స్ హీరోలు సాధించలేనిది అల్లు అర్జున్ చేసి చూపాడు. అందుకే ఇది చాలా ప్రత్యేకమైన గౌరవం. అల్లు అర్జున్ ని టాలీవుడ్ ప్రముఖులతో పాటు చిత్ర యూనిట్ అభినందించారు. శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక ఈ విజయాన్ని కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకున్నాడు బన్నీ. ముఖ్యంగా వైఫ్ స్నేహారెడ్డిని కౌగిలించుకు ముద్దాడాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ చేతిపై ఓ టాటూ ఉంది. అది ఆయన లవర్ నేమ్. ఇంతకీ ఆ లవర్ పేరు ఏంటంటే… స్నేహారెడ్డి. అవును ఇప్పుడు భార్య ఒకప్పటి లవర్ స్నేహారెడ్డి పేరును ఆయన టాటూగా వేయించుకున్నాడు. స్నేహ అని అల్లు అర్జున్ చేతిపై టాటూ ఉంటుంది.
స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. స్నేహారెడ్డి ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ కి పరిచయమైంది. అలా మొదలైన పరిచయం పెళ్ళికి దారి తీసింది. అల్లు అర్జున్ కి స్నేహారెడ్డిని ఇచ్చేందుకు మొదట ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఒప్పుకోలేదట. అల్లు అరవింద్ స్వయంగా వెళ్లి పిల్లను అడిగినా ససేమిరా అన్నాడట. అయితే స్నేహారెడ్డి పట్టుబట్టి తన ప్రేమను గెలిపించుకుందట.
ఇటీవల చంద్రశేఖర్ రెడ్డి నల్గొండలో ఓ కన్వెన్షన్ హాల్ కట్టించి, అల్లు అర్జున్ చేత ఓపెనింగ్ చేయించాడు. అల్లు అర్జున్ ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ రోజు పదివేల మందికి అన్నదానం, మహిళలకు చీరల పంపిణీ జరిగింది. మా అల్లుడికి నార్త్ ఇండియాలో కూడా విపరీతమైన క్రేజ్ ఉందని చంద్రశేఖర్ రెడ్డి చెప్పుకోవడం విశేషం. ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. పుష్ప 2 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుందని సమాచారం.