Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించని ట్రీట్ సిద్ధం చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ ఓజీ నుండి టీజర్ విడుదలవుతుంది. ఈ మేరకు ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ఓజీ టీజర్ విడుదల చేస్తున్నారు. ఇక టీజర్ పై భారీ హైప్ నెలకొంది. బయటికొస్తున్న ఒక్కొక్క డిటైల్ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ కలిగిస్తుంది.
ఓజీ టీజర్లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నేమ్ రివీల్ చేస్తున్నారట. చిత్ర వర్కింగ్ టైటిల్ ఓజీ గా ఉంది. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఓజీ అంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నేమ్ అంటున్నారు. దాని ఫుల్ ఫార్మ్… ఒజాసా గంభీర్ అంటున్నారు. ఇది నార్త్ పేరును పోలి ఉంది. సినిమా నేపథ్యం ముంబైలో ఎక్కువగా జరుగుతుంది. ఆ క్రమంలో ఆ పేరు పెట్టారు.
పవన్ కళ్యాణ్ నార్త్ ఇండియన్ నేమ్స్ తన పాత్రల పేరుకు పెట్టుకునేందుకు ఇష్టపడతాడు. సిద్ధార్థ్ రాయ్ కూడా నార్త్ ఇండియా పేరే. ఒక ఓజీ టీజర్ నిడివి 72 సెకండ్స్ ఉంటుందట. తమిళ నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో సాగుతుందట. అర్జున్ దాస్ ఈ చిత్రంలో కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం ఉంది. యాక్షన్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ టీజర్ అద్భుతంగా కట్ చేశారని సమాచారం.
ఓజీ టీజర్ గత చిత్రాల టీజర్ రికార్డ్స్ బద్దలు కొడుతుందని టాలీవుడ్ గట్టిగా నమ్ముతుంది. ఓజీ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ఓజీ ఓ గ్యాంగ్ స్టర్ బయోపిక్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామా అంటున్నారు.