Rakhi Festival 2023: రాఖీ పండుగ ఎప్పుడు? రాఖీ ఏ టైంలో కట్టుకోవాలి?

తెలుగురాష్ట్రాల్లోని పురోహితులు చెబుతున్న ప్రకారం.. ఆగస్టు 30, 31 రాఖీ పండుగ నిర్వహించుకోవాలని చెబుతున్నారు. అయితే 30న పౌర్ణమి గడియలు రాత్రి 9.01 సమయంలో పౌర్ణమి మొదలవుతుంది.

Written By: Chai Muchhata, Updated On : August 29, 2023 9:24 am

Rakhi Festival 2023

Follow us on

Rakhi Festival 2023: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. నేను నీకు రక్ష.. నాకు నీవు రక్ష.. అనుకుంటూ ప్రతీ చెల్లి తన అన్నకు ఈరోజు రాఖీ కడుతుంది. ప్రతీ శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాఖీ పండుగ జరుపుకుంటారు. ఈరోజున అన్నాచెల్లెళ్లు ఎక్కడున్నా.. ఒక్కచోటుకు వచ్చి కలుసుకొని ఆనందంగా ఉంటారు. అయితే ఈసారి రాఖీ పండుగపై సందిగ్ధం నెలకొంది. కొందరు రాఖీ పండుగను ఆగస్టు 30 నిర్వహించుకోవాలని, మరికొందరు 31న జరుపుకోవాలని అంటున్నారు. వాస్తవానికి పౌర్ణమి రోజు రాఖీ పండుగను నిర్వహించుకుంటారు. కానీ ఈ ఏడాది రెండు రోజుల్లె పౌర్ణమి గడియలు రావడంతో అసలు ఏరోజు రాఖీలు కట్టాలి? అనే దానిపై కొందరు పండితులు ఏం చెబుతున్నారంటే.

తెలుగురాష్ట్రాల్లోని పురోహితులు చెబుతున్న ప్రకారం.. ఆగస్టు 30, 31 రాఖీ పండుగ నిర్వహించుకోవాలని చెబుతున్నారు. అయితే 30న పౌర్ణమి గడియలు రాత్రి 9.01 సమయంలో పౌర్ణమి మొదలవుతుంది. కానీ ఈ సమయంలో భద్రకాలం ఉందని పురోహితులు చెబుతున్నారు. భద్రకాలంలో రాఖీ కట్టడం అంత మంచిది కాదని అంటున్నారు. అలా కట్టడం వల్ల దోషమం ఏర్పడుతుందట. ఒకవేళ రాఖీ కట్టినా సోదరుడిపై ప్రభావం ఉండే అవకాశం ఉందని అంటున్నారు.అయితే 30న బుధవారం రాత్రి 9.02 గంటల నుంచి ఆగస్టు 31 ఉదయం 7.05 నిమిషాల లోపు కట్టొచ్చని కొందరు పండితులు చెబుతున్నారు.

ఆగస్టు 31న రాఖీ పండుగ నిర్వహించుకోవాలనుకుంటే ఉదయం 6.02 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపు రాఖీ కట్టొచ్చని మరికొందరు చెబుతున్నారు. ఇదే రోజు మరికొన్ని సమయాల్లో రాఖీ కట్టొచ్చని అన్నారు. మధ్యాహ్నం 12.21 గంటల నుంచి 3.32 గంటల లోపు రాఖీ కట్టుకోవచ్చని చెబుతున్నారు. అలాగే సాయంత్రం 5.08 గంటల నుంచి 8.08 గంటల లోపు రాఖీ కట్టుకోవచ్చని చెబుతున్నారు. ఈసారి రెండు రోజుల్లో పౌర్ణమి రావడంతో ఇలాంటి సమయాలు ఏర్పడ్డాయని పండితులు చెబుతున్నారు.

ఇక రాఖీ పౌర్ణమి చరిత్రలోకి వెళితే.. శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్లి బలి చక్రవర్తికి రాఖీ బంధం కట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. మరో కథనం ప్రకారం. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కట్టిందట. అలా కట్టినందుకు ఎల్లవేళలగా తనకు అండగా ఉంటానని మాట ఇస్తాడు. అలా రాఖీ పౌర్ణమి పండుగ నిర్వహించుకుంటారని చెబుతున్నారు.