Akira Nandan Debut Movie: సినిమా ఇండస్ట్రీలో వారసత్వమనేది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి పనిచేస్తుందే తప్ప హీరో గా నిలబెట్టడానికి కాదు. ఇది చాలా మంది హీరోల విషయంలో ప్రూవ్ అయింది. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తనదైన సత్తా చూపించి స్టార్ హీరోగా మారాడు. ఇప్పటికి ఆయననుంచి సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులందరు అమితంగా ఇష్టపడడమే కాకుండా ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు… ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతను కొనసాగిస్తున్నాడు. కాబట్టి తన నుంచి వచ్చే సినిమాల విషయంలో ప్రేక్షకులందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత సంవత్సరం ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఈ సంవత్సరం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత ఆయన మరికొన్ని సినిమాలను చేసి ఇండస్ట్రీకి రిటర్మెంట్ ప్రకటించే అవకాశమైతే ఉంది. కాబట్టి ఈ లోపే తన కొడుకు అయిన అకీరా నందన్ ను హీరోగా పెట్టి ఇండస్ట్రీకి పరిచయం చేయాలని తనను స్టార్ హీరోగా మార్చాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు.
ఇక దానికి అనుగుణంగానే కొంతమంది స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సైతం ఇండస్ట్రీకి అకిరా నందన్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేయాలని చూస్తున్నారు… ఇక దిల్ రాజు సైతం అకిరానందన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఈ విషయాన్ని చెప్పారని ఇప్పటికే రేణు దేశాయ్ ని కలిసి కొంత మనీ ని కూడా అడ్వాన్స్ గా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొదటి సినిమా మాత్రం తనతోనే చేయాలని దిల్ రాజు కండిషన్ పెట్టాడట.
ఇక మొత్తానికైతే దిల్ రాజు నుంచి వచ్చే సినిమా డీసెంట్ గా ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఏది ఏమైనా కూడా అఖీరానందన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రొడ్యూసర్ ఎవరో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసే దర్శకుడు ఎవరనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు. తొందర్లోనే ఈ విషయానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని దిల్ రాజు నుంచి అఫీషియల్ గా రాబోతుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది…