Akira Nandan in OG: ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) లాంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి విడుదల అవుతున్న చిత్రం ‘ఓజీ'(They Call Him OG). పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఓజీ సినిమా కూడా ఒకటి. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వరుస రీమేక్ సినిమాలు చేస్తూ నేటి తరం యూత్ ఆడియన్స్ ని కాస్త నిరాశ పరిచాడు. ఆయన తోటి స్టార్ హీరోలు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ భారీ కాంబినేషన్స్ తో అభిమానులను సంతృప్తి పరుస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం రీమేక్ సినిమాలతోనే సరిపెడుతున్నాడని అభిమానుల్లో ఉండే చిన్న నిరాశ ని ఓజీ చిత్రం తుడిచేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ ఉన్న అంచనాలను రెట్టింపు చేసే విధంగానే ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ పాట ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనమంతా చూశాము.
రేపు ఈ చిత్రం నుండి ‘సువ్వి సువ్వి’ అనే మెలోడీ సాంగ్ విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా మీద ఇంతటి విపరీతమైన భారీ అంచనాలు ఉండడానికి ప్రధాన కారణాలలో ఒకటి అకిరా నందన్ ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్నాడు అనే వార్త. ఈ సినిమా క్లైమాక్స్ లో అకిరా నందన్ గెస్ట్ రోల్ ద్వారా కనిపిస్తాడని, రెండవ భాగం మొత్తం ఆయనే హీరో గా ఉంటాడని, ఇలా పలు రకాల వార్తలు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ ని పెంచాయి. అయితే ఈ చిత్రం లో అకిరా నందన్(Akira Nandan) ఉన్నాడు అనే వార్త పూర్తి గా ఫేక్ న్యూస్ అని మూవీ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మీకు మీరే ఏవేవో ఊహించుకోవద్దు, ఏదైనా ఉంటే మేము స్వయంగా అధికారికంగా చెప్తామంటూ మూవీ టీం కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు.
కానీ ఇప్పటికీ ఈ చిత్రం లో అకీరానందన్ ఉన్నాడని అత్యధిక శాతం మంది అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇది ఓజీ చిత్రానికి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అకిరా నందన్ ఉన్నాడు అనే అంచనాలతో ఈ చిత్రాన్ని చూస్తారు ఆడియన్స్. ఒకవేళ అతను లేడనే విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ తీవ్రమైన నిరుత్సహానికి గురి అవుతారు. దాని వల్ల టాక్ నెగటివ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా ఎంత బాగున్నా కూడా బాలేదు అనే ఫీలింగ్ తో ఆడియన్స్ బయటకి వస్తారు. అందుకే అభిమానుల్లో ఉన్న ఈ తప్పుడు అంచనాలకు చెక్ పెడుతూ మూవీ టీం సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ది వరల్డ్ ఆఫ్ ఓజీ’ అనే గ్లింప్స్ వీడియో ని విడుదల చేస్తారట. ఈ వీడియో ద్వారా అసలు సినిమా ఏంటి అనే క్లారిటీ పూర్తిగా ఆడియన్స్ కి వస్తుందని, అప్పుడు సరైన అంచనాలతో ఈ సినిమాకు వెళ్తారని అంటున్నారు. ఇకపోతే సెప్టెంబర్ 25 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని ఈ నెల 29 నుండి ప్రారంభించబోతున్నారు.