Homeవింతలు-విశేషాలుKanpur marriage case: సరసాలకు రండి శ్రీవారు అంటే.. ఉలుకు లేదు. పలుకూ లేదు.. ఫైనల్...

Kanpur marriage case: సరసాలకు రండి శ్రీవారు అంటే.. ఉలుకు లేదు. పలుకూ లేదు.. ఫైనల్ గా ఈ కొత్త పెళ్లికూతురు ఏం చేసిందంటే?

Kanpur marriage case: అట్టహాసంగా పెళ్లి జరిగింది. లక్షలు పెట్టి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. భర్తతో తన కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ ఆమె అత్తింట్లోకి అడుగు పెట్టింది.

భర్తతో చిలిపి మాటలు మాట్లాడుతూ.. తనలో తానే మురిసిపోయింది. అతనితో భవిష్యత్తు కాలం మొత్తం బాగుండాలని.. బావి జీవితమంతా బంగారు మయం కావాలని కోరుకుంది. వివాహం జరిగిన తర్వాత.. కొన్ని క్రతువులు పూర్తయ్యాయి. అనంతరం అసలైన రోజు రానే వచ్చింది. వారిద్దరూ ఏకమయ్యే సందర్భానికి పురోహితులు ముహూర్తం పెట్టారు. సరిగ్గా ఆరోజు రానే వచ్చింది.

తన భర్తతో మొదటిరోజు రాత్రి ఆనందంగా గడపాలని ఆమె భావించింది. తన భర్తతో చిలిపి మాటలు మాట్లాడింది. కొంటె సైగల తో రెచ్చగొట్టింది. అతని వద్ద నుంచి కనీస స్పందన కూడా రాకపోవడంతో.. ఆమె తీవ్రంగా బాధపడింది. ఇలా వరుసగా నాలుగు రోజులు భర్త నుంచి అదే తీరైన ప్రవర్తన ఎదురు కావడంతో ఆమె మనసు కలత చెందింది.

ఇదే విషయాన్ని భర్త తరపున వారితో చెబితే.. మా వాడికి లోపం ఉంది.. చికిత్స చేయిస్తున్నాం.. అంతా సర్దుకుంటుందని చెప్పారు. మళ్లీ కొద్ది రోజులకు నోయిడాలో వారు కాపురం పెట్టారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురు కావడంతో ఆమె తట్టుకోలేకపోయింది. చివరికి ఈ విషయాన్ని అత్త మామలతో చెబితే.. అతడికి చికిత్స చేయించడానికి ఐదు లక్షలు కావాలని.. ఆ డబ్బు మీ పుట్టింటి వారి దగ్గర నుంచి తీసుకురావాలని ఆమెకు సూచించారు. దీంతో ఇదంతా ఏదో మోసం లాగా ఉందని భావించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలోని కిషోర్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కిషోర్ నగర్ ప్రాంతానికి చెందిన యువతిని హమీర్పూర్ జిల్లా కు చెందిన యువకుడికి ఇచ్చి గత ఏడాది ఏప్రిల్ 25న వివాహం జరిపించారు. వివాహం కోసం ఆ యువతి తండ్రి దాదాపు 38 లక్షలు ఖర్చు చేశాడు. ఖరీదైన హోటల్లో వివాహం జరిపించాడు. బంగారు నగలు.. వెండి వస్తువులు పెట్టాడు. ఇంత చేసినప్పటికీ అల్లుడి దగ్గర మ్యాటర్ లేకపోవడంతో.. కూతురి జీవితం ఇలా అయిపోయింది అంటూ ఇప్పుడు బాధపడుతున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular