Homeఎంటర్టైన్మెంట్Star heroine in Yellamma movie: ఎల్లమ్మ సినిమాలో ఎల్లమ్మ పాత్రలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్...

Star heroine in Yellamma movie: ఎల్లమ్మ సినిమాలో ఎల్లమ్మ పాత్రలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్…

Star heroine in Yellamma movie: ఒక సినిమా చేయడం ఎంత ముఖ్యమో దాన్ని సక్సెస్ ఫుట్ గా నిలపడం కూడా అంతే ముఖ్యం…ఒక ప్రొడ్యూసర్ దర్శకుడిని నమ్మి సినిమా మీద డబ్బులు పెట్టినప్పుడు ఆ సినిమాను సూపర్ సక్సెస్ గా నిలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా ఒక దర్శకుడు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో క్లారిటిని మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మొదట సినిమా ఇండస్ట్రీకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన వేణు ఎల్దండి సైతం బలగం సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆయన దేవి శ్రీ ప్రసాద్ ని హీరోగా పెట్టి ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఎల్లమ్మ యొక్క ప్రాముఖ్యతను తన గొప్పతనాన్ని తెలియజేసే కథగా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ పాత్రను ఎవరు పోషిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని కలిగిస్తుంది. మొదట ఈ సినిమాలో సాయి పల్లవి ఎల్లమ్మ పాత్రను పోషిస్తుంది అంటూ రూమర్లైతే వచ్చాయి… కానీ అవేవీ కార్యరూపం అయితే దాల్చలేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రుక్మిణి వసంత్ ఎల్లమ్మ పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటికే ఈమె ‘కాంతార చాప్టర్ వన్’ లో నటించింది.

ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆమెకు పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపైతే వచ్చింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ – జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఎల్లమ్మ సినిమాలో టైటిల్ రోల్ కావడంతో ఆమె చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వేణు ఎల్దండి సైతం ఆమెను తీసుకోవాలని చూస్తున్నాడు.

ఈ సినిమాలో ఆమె నటిస్తే ఈ సినిమాకు తను అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆమె చాలా పద్ధతిగా ఉంటుంది. అలాగే తన ఫేస్ చూసినా కూడా ఒక దేవత రూపంలో కనిపిస్తుంటుంది. నిజంగా తను ఎల్లమ్మ తల్లి అని మనం నమ్మడానికి ఆస్కారమైతే ఉంటుంది.

కాబట్టి తను అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలదు అంటూ ప్రతి ఒక్కరు వాళ్ళు అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…చూడాలి మరి ఆమె నిజంగానే ఈ సినిమా చేస్తుందా..? లేదంటే కావాలనే కొంతమంది ఈ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular