Pavitra Lokesh: ఇటీవల కాలం లో బాగా వివాదాల్లోకి చిక్కుకున్న జంట నరేష్ మరియు పవిత్ర లోకేష్..గత కొంతకాలం నుండి ఎక్కడ చూసిన వీళ్లిద్దరి గురించే చర్చ..సోషల్ మీడియా తెరిస్తే చాలు వీళ్లిద్దరి గురించి ఎదో ఒక వార్త కనిపిస్తూనే ఉంటుంది..కొన్నేళ్ల నుండి వీళ్లిద్దరు చేస్తున్న సహా జీవనం ఇటీవలే బయటపడడం..ఆ తర్వాత నరేష్ మూడవ భార్య రమ్య మీడియా ముందుకి వచ్చి రచ్చ చెయ్యడం..ఇలాంటి సంఘటనలన్నీ ఎలాంటి దుమారానికి దారి తీశాయి మన అందరికి తెలిసిందే..ఈ కాంట్రవర్సీ వల్ల పవిత్ర లోకేష్ బాగా పాపులర్ అయిపోయింది..ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆమెకి సినిమా అవకాశాలు ఫుల్లుగా వస్తున్నాయి..అంతే కాకుండా ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి కూడా దర్శక నిర్మాతలు ఆలోచించడం లేదు..అదే సమయం లో ఈ కాంట్రవర్సీ ఆమెకి నెగటివ్ కూడా అయ్యింది..దానికి ఉదాహరణే ఇటీవల జరిగిన ఒక సంఘటన..పవిత్ర లోకేష్ ఇటీవలే ఒక స్టార్ హీరో సినిమాలో నటించడానికి సంతకం చేసింది.
అయితే పవిత్ర లోకేష్ ని ఆ సినిమాలో తీసుకున్నట్టు ఆ హీరో కి తెలియదు..షూటింగ్ లొకేషన్ కి రాగానే పవిత్ర లోకేష్ గారిని చూసి షాక్ కి గురైన ఆ హీరో ‘ఈమె మన సినిమాలో ఉందేంటి..వెంటనే తీసేయండి..నేను ఆమెతో నటించలేను’ అంటూ నిర్మాతకి వెళ్లి చెప్పాడట..ఈ మాట పవిత్ర లోకేష్ కూడా విని హర్ట్ అయినట్టు సమాచారం..ఇక నిర్మాతకి పవిత్ర లోకేష్ గారిని తీసివేయడం ఇష్టం లేకపోయినా కూడా హీరో బలవంతం చెయ్యడం తో తియ్యక తప్పలేదు.
ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..ఇంతకీ ఆ హీరో ఎవరు ఏమిటి అనే విషయం బయటకి రాలేదు..అలా ఈ వివాదం పవిత్ర లోకేష్ కెరీర్ కి ఎంత ప్లస్ అయ్యిందో అంత మైనస్ కూడా అయ్యింది అంటూ సోషల్ మిడియా లో వినిపిస్తున్న మాట..ఇక నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వివాదాలతో సంబంధం లేకుండా క్యారక్టర్ ఆర్టిస్టు గా ఆయనకీ ఉన్న డిమాండ్ మరొకరికి లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలలో ఆయన ఉండాల్సిందే.
Also Read:KCR Politics: ‘బండి సంజయ్’ అరెస్ట్ కు కవితకు సంబంధమేంటి? కేసీఆర్ ‘డైవర్ట్ పాలిటిక్స్’ సక్సెస్