Bimbisara Director Vasishta: టాలీవుడ్ లో కొత్త టాలెంట్ ని బాగా ప్రోత్సహించేవారిలో ఒకరు నందమూరి కళ్యాణ్ రామ్..ఇప్పటి వరుకు ఈయన స్టార్ డైరెక్టర్స్ తో ఎక్కువగా సినిమాలు తియ్యలేదు..ఒక నిర్మాణ సంస్థ ప్రారంబించి నష్టాలొచ్చినా కూడా కళ్యాణ్ రామ్ కొత్త డైరెక్టర్స్ తోనే సినిమాలు తీస్తూ వచ్చారు..వారిలో గ్రాండ్ సక్సెస్ అయినా వారు అనిల్ రావిపూడి మరియు సురేందర్ రెడ్డి..వీళ్లిద్దరు ఇప్పుడు టాలీవుడ్ లో ఎంత పెద్ద టాప్ స్టార్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వీళ్లిద్దరి తర్వాత లేటెస్ట్ గా ఆ లిస్ట్ లోకి చేరిపోయాడు డైరెక్టర్ వసిష్ఠ..ఇటీవలే ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన కళ్యాణ్ రామ్ భింబిసారా చిత్రం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..సుమారు 35 కోట్ల రూపాయిల షేర్ ని ఈ సినిమా వసూలు చేసింది..తొలి సినిమా భింబిసారా కి వసిష్ఠ విడుదలకు ముందు కళ్యాణ్ రామ్ నుండి నెల జీతం తీసుకుంటూ ఉండేవాడు..కానీ విడుదలై భారీ విజయం సాధించిన తర్వాత కళ్యాణ్ రామ్ అతనికి భారీ మొత్తం లోనే పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇక త్వరలోనే ఈ సినిమా కి సీక్వెల్ తియ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సీక్వెల్ కి గాను కళ్యాణ్ రామ్ వసిష్ఠ కి మూడు కోట్ల రూపాయిలు పారితోషికం ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..కేవలం రెండవ సినిమాతోనే వసిష్ఠ ఈ రేంజ్ కి చేరుకోవడం అంటే మాటలు కాదు..ఈ సినిమా హిట్టైన తర్వాత వసిష్ఠ కి టాలీవుడ్ టాప్ హీరోలు కూడా అవకాశం ఇస్తారు అనడం లో ఎలాంటి సందేహం లేదు..త్వరలోనే ఆయనని సురేందర్ రెడ్డి మరియు అనిల్ రావిపూడి వంటి టాప్ డైరెక్టర్స్ లీగ్ లో మనం చూడవచ్చు..ఇక భింబిసారా బాక్స్ ఆఫీస్ వసూళ్ల విషయానికి వస్తే ఇప్పటికి కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయవంతం గా థియేటర్స్ లో నడుస్తుంది.
Also Read: Hero Rajasekhar: అప్పు పుట్టక కుమిలిపోతున్న స్టార్ హీరో.. మరోవైపు కేసు పెడతాను అంటున్న నిర్మాత
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరుకు 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వాచినట్టు తెలుస్తుంది..కొత్త సినిమాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా భింబిసారా రన్ మాత్రం ఆగట్లేదు..మరి ఫుల్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమా 40 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
Also Read:Payal Rajput: 50 లక్షల కోసం పాయల్ రాజ్ పుత్ సంచలన నిర్ణయం.. ఆ సీన్స్ కి సై.. సంతోషంలో నిర్మాతలు