Cheteshwar Pujara: ఛతేశ్వర్ పూజారా ప్రస్తుతం తన బ్యాట్ కు పనిచెబుతున్నాడు. చెలరేగి ఆడుతున్నాడు. దీంతో అతడిని అడ్డుకోవడం ఎవరి వల్ల కావడం లేదు. క్రికెట్ లో అత్యంత వేగంగా పరుగులు చేస్తూ తన బ్యాట్ ను ఝళిపిస్తున్నాడు. కేవలం 90 బంతుల్లో 20 ఫోర్లు, రెండు సిక్సర్లతో 132 పరుగులతో చెలరేగాడు. మిడిల్ సెక్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో తనదైన శైలిలో రాణించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. రాయల్ లండన్ కప్ లో పూజారా తన బ్యాట్ తో సమాధానం చెబుతున్నాడు.
తాజాగా మిడిల్ సెక్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పూజారా సెంచరీ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. 75 బంతుల్లో సెంచరీ చేసిన పూజారా ఇప్పటివరకు 614 పరుగులు చేయడం విశేషం. వార్ వి క్లబ్ తో జరిగిన మ్యాచ్ లో 73 బంతుల్లో సెంచరీ చేసిన పూజారా సుర్రేతో జరిగిన మ్యాచ్ లో 174 పరుగులు చేసి క్లాస్ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసి అందరిని ఆశ్చర్యపరచాడు. మిడిల్ సెక్స్ లో స్టీఫెన్ ఎస్కీనజీ 645తో మొదటి స్థానంలో ఉండగా పూజారా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 500 పరుగులు చేసిన ఇద్దరు బ్యాట్స్ మెన్ వీరే కావడం గమనార్హం.
పూజారాతో కలిసి మరో సుసెక్స్ ఓపెనర్ టామ్ అల్సాప్ 155 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సులతో 189 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 400 పరుగుల భారీ స్కోరు చేసింది. సుసెక్స్ క్లబ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పూజారా నేటి ఇన్నింగ్స్ లో చివరి 26 బంతుల్లో 62 పరుగులు చేసి ప్రత్యర్థికి సవాలు విసరటం విశేషం. దీంతో ఛతేశ్వర్ పూజారా తనదైన ఆటతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇలా ఆడితే మన వన్డే జట్టులోకి కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్రీడా పండితుతులు చెబుతున్నారు.
గత కొద్ది రోజులుగా ఆత్మవిశ్వాసంతో ఆడని పూజారా నేడు బ్యాట్ తో విన్యాసాలు చేస్తుండటం తెలిసిందే. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో ఒక్క సిక్సు కూడా కొట్టని పూజారా అక్కడ మాత్రం ఏదో మాయ చేసినట్లు అలా విజృంభించడం అందరిని ఆలోచనలో పడేస్తోంది. లండన్ లో ఇప్పటిదాకా వన్డేల్లో 11 సిక్సులు బాదడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జింబాబ్వే టూర్ లో కూడా కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ కంటే చెలరేగి ఆడిన పూజారాకు ఈసారి జట్టులో చోటు దక్కడం ఖాయమనే చెబుతున్నారు.
Also Read:KCR Politics: ‘బండి సంజయ్’ అరెస్ట్ కు కవితకు సంబంధమేంటి? కేసీఆర్ ‘డైవర్ట్ పాలిటిక్స్’ సక్సెస్