https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కథ ఇవ్వడం వల్లే ఆ సినిమా ప్లాప్ అయింది అంటున్న స్టార్ డైరెక్టర్…

సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోలు ఉన్న కూడా కొందరికి మాత్రమే ఇక్కడ చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది..ఇక వాళ్ల సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 10, 2024 / 01:05 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్కో ఇమేజ్ అయితే ఉంటుంది. ఇక వాళ్లు ఎలాంటి సినిమాలను చేయాలి అనేది కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ హీరో అభిమానులు ఆయన్ని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి పాత్రలను ఎంచుకొని వాటిలో ఒక కొత్తదనాన్ని చూపించడానికి వాళ్లేప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి తమ్ముడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తనదైన రీతిలో మంచి సినిమాలను చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు…ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలలైతే రేకెత్తిస్తుంటాయి. ఇక పవన్ కళ్యాణ్ బాబీ డైరెక్షన్ లో చేసిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు. నిజానికి గబ్బర్ సింగ్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందని అందరూ మంచి కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేశారు. కానీ అందరి ఊహగానాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ గా మారడం అటు పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ, ఇటు బాబీలోను తీవ్రమైన నిరాశను కలిగించిందనే చెప్పాలి.

    అయితే రీసెంట్ గా బాబీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా మీద సంచలన కామెంట్స్ చేశాడు. ఇక అందులో భాగంగానే ఆయన తన మొదటి సినిమా అయిన పవర్ ని రవితేజ తో చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు… రెండో సినిమాకి పవన్ కళ్యాణ్ కథ ఇవ్వడం వల్లే తను దాన్ని ఓన్ చేసుకోలేకపోయాడని అందువల్లే సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పాడు.

    ఇక అలాగే ‘వెంకీ మామ’ సినిమా కూడా కథ తనది కాదని వేరే వాళ్ళ కథలతో సినిమా చేయడం వల్లే ఆ సినిమా కూడా ప్లాప్ అయిందని చెప్పాడు. ఇక ఇప్పుడు తన ఎంటైర్ కెరియర్ లో చూసుకుంటే ఆయన చేసిన సినిమాల్లో ఆయన కథతో చేసిన సినిమాలు మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాయి… ఎన్టీఆర్ తో జై లవకుశ, చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఇప్పుడు బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నాడు.

    ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు…ఇక మీదట కూడా ఆయన తన కథలతోనే సినిమాలు చేస్తానని వేరే వాళ్ళ కథలు తీసుకొని సినిమాలు చేసే ఉద్దేశ్యం తనకు లేదని కూడా స్పష్టం చేశాడు…ఇక మొత్తం మీద ఆయన ఇప్పుడు ఇండస్ట్రీ లో ఒక టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందటం అనేది కూడా చాలా మంచి విషయం అనే చెప్పాలి…