https://oktelugu.com/

Double iSmart: ఇస్మార్ట్ శంకర్ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్న బాలీవుడ్ స్టార్ హీరో…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పూరి జగన్నాధ్ కి ఒక మంచి గుర్తింపు ఉంది. ఇక ఆయన చేసిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 10, 2024 / 12:58 PM IST

    Double iSmart

    Follow us on

    Double iSmart: 2019 వ సంవత్సరంలో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ గా మరోసారి తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. 2014లో టెంపర్ తర్వాత ఆయనకు మరొక సక్సెస్ అయితే దక్కలేదు. దాంతో ఐదు సంవత్సరాల తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ తో భారీ సక్సెస్ ని అందుకున్న పూరి ఆ సక్సెస్ ల పరంపరని కొనసాగించాలని ఆ వెంటనే విజయ్ దేవరకొండ తో లైగర్ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా అనుకున్న విజయాన్ని అందించలేదు. ఇక పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్ డిజాస్టర్ గా మారింది. మొత్తానికైతే ఈ సినిమా తర్వాత మరోసారి రామ్ ని హీరోగా పెట్టి చేస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

    ఇక ఈ సినిమా మీద ఇప్పటికే అటు బాలీవుడ్ లోనూ టాలీవుడ్ లోనూ అందరిలో మంచి అంచనాలైతే ఉన్నాయి మరి దానికి అనుకూలంగానే ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించి సూపర్ సక్సెస్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పూరి జగన్నాధ్ మరోసారి తన స్టామినా ను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నాడు అంటూ కొన్ని రోజుల నుంచి వార్తలైతే వస్తున్నాయి. ఇక ఆ హీరో ఎవరు అనే దానిమీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గెస్ట్ అప్పియారెన్స్ ఇవ్వబోతున్నట్లు గా తెలుస్తుంది. ఆయన క్యారెక్టర్ ఒక ఐదు నిమిషాలపాటు ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అయితే షారుక్ ఖాన్ క్యారెక్టర్ కి కూడా ఈ సినిమాలో ఇంపార్టెన్స్ ఉంటుందట.

    ఐదు నిమిషాలు ఆయన పోషించిన పాత్ర ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక బాలీవుడ్ లో ఈ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అవ్వడానికి పూరి జగన్నాథ్ ఇలాంటి స్ట్రాటజీని వాడుతున్నారని చాలా మంది చెబుతున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకొని పూరి జగన్నాధ్ పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…