Homeఎంటర్టైన్మెంట్Aarthi and Aditi Agarwal: ఆర్తి అగ‌ర్వాల్ చ‌నిపోయాక చెల్లెలు అదితి ప‌రిస్థితి ఇలా అయిపోయిందేంటి..?

Aarthi and Aditi Agarwal: ఆర్తి అగ‌ర్వాల్ చ‌నిపోయాక చెల్లెలు అదితి ప‌రిస్థితి ఇలా అయిపోయిందేంటి..?

Aarthi and Aditi Agarwal: టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఆర్తి అగ‌ర్వాల్ గురించి అంద‌రికీ తెలిసిందే. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో అంద‌రి దృష్టిలో ప‌డింది ఆర్తి. ఆ త‌ర్వాత చిరు ప‌క్క‌న ఇంద్ర మూవీ చేసే ఛాన్స్ ద‌క్కింది. వీటిక‌న్నా ముందే ఆమె నీ స్నేహం, నువ్వు లేక నేను లేను లాంటి సినిమాల‌తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Aarthi and Aditi Agarwal
Aarthi and Aditi Agarwal

వీటి త‌ర్వాత వ‌సంతం, గోరింటాకు లాంటి సినిమాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత కూడా చాలా సినిమాల్లోనే న‌టించింది. చూడ‌టానికి గ్లామ‌ర్ గా ఉండ‌టం, యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉండ‌టంతో త్వ‌ర‌గానే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఆర్తి. అందం, అభిన‌యంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో అలరించిన ఆర్తి అగ‌ర్వాల్‌.. ఇప్ప‌టికే అభిమానుల గుండెల్లో కొలువు దీరే ఉంది. కాగా ఈమె స్టార్ హీరోయిన్ గా ఉన్న క్ర‌మంలోనే ఆమె చెల్లెలు అదితి అగర్వాల్ కూడా సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Aarthi and Aditi Agarwal
Aarthi and Aditi Agarwal

కానీ ఆర్తి అగ‌ర్వాల్ లాగా స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది. ఆర్తి మాత్రం ఆమె చెల్లెలుకు అన్ని ర‌కాలుగా స‌హ‌క‌రించింది. ఆమె అల్లు అర్జున్ మొద‌టి మూవీ గంగోత్రితో సినీ కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ మూవీ హిట్ కావ‌డంతో ఆమెకు మ‌రిన్ని సినిమాల్లో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది. కానీ వ‌చ్చిన అవకాశాన్ని స‌రిగ్గా వినియోగించుకోలేక‌పోయింది అదితి అగ‌ర్వాల్‌.

Aarthi and Aditi Agarwal
Aarthi and Aditi Agarwal

Also Read: మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కుమారుల్లో ఎవరు బెస్ట్ హీరో కాగలరు? ఆ సామర్థ్యం ఎవరికుంది?

రాను రాను అదితికి అవ‌కాశాలు పూర్తిగా త‌గ్గిపోసాగాయి. ఇక ఈ స‌మ‌యంలోనే ఆర్తి అగ‌ర్వాల్ అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా చ‌నిపోవ‌డం అంద‌రినీ శోక‌సంద్రంలోకి నెట్టింది. ఇక ఆర్తి మ‌ర‌ణంతో ఆమె చెల్లెలు అదితి ప‌రిస్థితి దారుణంగా త‌యారయింది. ఆర్తి అగ‌ర్వాల్ ఉన్న స‌మ‌యంలో ఆమె స్టార్ హీరోయిన్ అయితే కెరీర్ లో నిలదొక్కుకునేది. కానీ ఆమె ఆ స్థాయిలో రాణించ‌లేకపోయింది.

Also Read: ఇన్నాళ్ల‌కు రాణా గుర్తొచ్చాడా.. భీమ్లా నాయ‌క్ రిలీజ్ పోస్ట‌ర్ల‌తో అంచ‌నాలు పెంచేసిన మేక‌ర్స్‌..!

ఇక ఆర్తి కూడా లేక‌పోవ‌డంతో అదితి పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. కుటుంబంతో క‌లిసి దూరంగా నివ‌సిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె నుంచి ఎలాంటి అప్డేట్లు లేవు. కనీసం ఆమె సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద‌గా క‌నిపించ‌ట్లేదు. దీంతో ఆమెను దాదాపు అంద‌రూ మ‌ర్చిపోయారు. ఆమె న‌టించిన ఆరు సినిమాల్లో రెండు మాత్ర‌మే సూప‌ర్ హిట్ అయ్యాయి. మిగ‌తా సినిమాలు డిజాస్ట‌ర్ కావ‌డంతో స‌క్సెస్ రేట్ క‌న్నా.. ఫెయిల్యూర్స్ ఎక్కువ‌య్యాయి. దాంతో ఆమెకు అవకాశాలు రాలేదు.

Also Read:
1. అర్థరాత్రి రోడ్డు పై మద్యం మత్తులో ఉన్న హీరోయిన్ అరెస్ట్
2. ‘నందిని’గా అదరగొట్టిన అనుపమ పరమేశ్వరన్ !

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Nandamuri Balakrishna:  నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాని భారీ స్థాయిలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ శుక్రవారం నుంచి తెలంగాణలోని సిరిసిల్లలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ఓ ఫొటోను దర్శకుడు గోపీచంద్ ట్వీట్ చేశారు. తొలిరోజు రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో బాలయ్యపై యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular