Homeఎంటర్టైన్మెంట్Kavya Thapar: అర్థరాత్రి రోడ్డు పై మద్యం మత్తులో ఉన్న హీరోయిన్ అరెస్ట్

Kavya Thapar: అర్థరాత్రి రోడ్డు పై మద్యం మత్తులో ఉన్న హీరోయిన్ అరెస్ట్

Kavya Thapar: ఏక్ మినీ కథ హీరోయిన్ కావ్యా థాపర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మద్యం తాగి కారు నడిపి యాక్సిడెంట్ చేయడంతో ఒకరు గాయపడ్డారు. తర్వాత పోలీసులను బూతులు తిట్టడమే కాకుండా ఓ అధికారి కాలర్ పట్టుకుని కొట్టింది. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడిషియల్ కస్టడీ విధించారు.

Kavya Thapar
Kavya Thapar

అసలేం జరిగింది అంటే.. కావ్యా థాపర్‌ నిన్న అర్థరాత్రి తాగి కారు నడిపి యాక్సిడెంట్‌ కు కారణమైంది. ఆమె గురువారం రాత్రి ఓ పార్టీకి హజరైంది. ఈ నేపథ్యంలో బాగా తాగిన ఆమె, అర్థరాత్రి కారు నడుపుతూ ముంబైలోని జె డబ్ల్యూ మారియట్ హోటల్ వద్ద యాక్సిడెంట్ చేసింది. ఆ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన ఆమెను పోలీసులు ప్రశ్నించగా.. ఆమె వారితో వాగ్వాదానికి దిగి నానా యాగీ చేసింది.

Also Read: ‘నందిని’గా అదరగొట్టిన అనుపమ పరమేశ్వరన్ !

పైగా ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టింది. దీనికితోడు డ్యూటీలో ఉన్న పోలీసులతో గొడవ పడుతూ లేడీ కానిస్టేబుల్స్‌ పట్ల అభ్యంతరకరంగా వ్యవహరిస్తూ చేయి కూడా చేసుకుంది అని తెలుస్తోంది. అసలు ఒక మహిళ పోలీసుల కాలర్‌ పట్టుకుని అసభ్యకర పదజాలంతో దూషణకు దిగినందుకు కావ్యా పై పోలీసులు సీరియస్ రియాక్షన్ తీసుకున్నారు.

ఆమెను అదుపులోకి తీసుకుని జూహు పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించారు. అలాగే నేడు అంధేరి కోర్టులో ఆమెను హాజరు పరుస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కావ్యా థాపర్‌ కి జ్యూడిషియల్ కస్టడీ విధించారు. అయినా అర్థరాత్రి రోడ్డుపై మద్యం మత్తులో ఇలా కావ్యా థాపర్‌ హల్చల్ చేసి హంగామా చేయడం సినీ ఇండస్ట్రీకే అవమానం.

Also Read:  మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కుమారుల్లో ఎవరు బెస్ట్ హీరో కాగలరు? ఆ సామర్థ్యం ఎవరికుంది? 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

2 COMMENTS

  1. […] Mohan Babu Son Of India Collections: కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు ‘సన్నాఫ్‌ ఇండియా’ కలెక్షన్లు దారుణంగా ఉంటాయని ట్రేడ్‌ వర్గాలు ముందే చెప్పాయి. ఆ ఊహాజనిత కలెక్షన్సే నిజం అయ్యాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ను లెక్కేస్తే.. మోహన్ బాబు సినీ కెరీర్ లోనే ‘సన్నాఫ్‌ ఇండియా’ భారీ డిజాస్టర్ గా నిలిచింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular