Anupama Parameswaran: ‘అర్జున్ సురవరం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. అయితే నిఖిల్ మరో క్రేజ్ సినిమాతో రాబోతున్నాడు. నిఖిల్ సిద్ధార్థ్, హోమ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న మూవీ 18 పేజెస్. అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే సందర్భంగా ఆమె పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో ఆమె నందిని పాత్రలో నటిస్తోంది.

ఇక అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం నిఖిల్ తోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఈ ’18 పేజెస్’ అనే చిత్రంలో అనుపమ – నిఖిల్ కలిసి నటిస్తున్నట్టే.. ‘కార్తికేయ 2’ చిత్రంలో కూడా నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా నటిస్తోంది. నిఖిలే ఆమెకు ఛాన్స్ ఇప్పించాడని టాక్ కూడా ఉంది.
Also Read: ఇర్కాన్‌లో 40 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు.. రూ.లక్షకు పైగా వేతనంతో?
సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఈ ’18 పేజెస్’ సినిమా రాబోతుంది. గీతా ఆర్ట్స్2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ మూవీని బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ మూవీ వస్తుంది అనే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా నిఖిల్ పల్లవి వర్మను వివాహం చేసుకున్నాడు. గోవాలో ప్రపొజ్ చేసి ఆమెను మెప్పించి వారి పెద్దల్ని కూడా ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాడు. ‘అర్జున్ సురవరం’ మంచి వసూళ్లను రాబట్టి.. నిఖిల్ కెరీర్ లో బెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలిచింది.
Also Read: కేసీఆర్ తో విభేదాలపై స్పందించిన చినజీయర్ స్వామి.. హాట్ కామెంట్స్
[…] Ram Charan: మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖ నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆచార్య సెట్స్ పై కొణిదెల సురేఖ ఉన్నప్పటి ఫొటోను పంచుకున్నారు. ట్విట్టర్ లో ఈ పిక్ పంచుకున్న రామ్ చరణ్.. “నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను మరెవ్వరూ అర్థం చేసుకోలేరు.. హ్యాపీ బర్త్ డే మా” అంటూ భావోద్వేగ భరితంగా స్పందించిన సంగతి తెలిసిందే. […]
[…] […]
[…] Also Read: ‘నందిని’గా అదరగొట్టిన అనుపమ పరమేశ్వ… […]